బోల్డ్ గా నటిస్తే అలా పిలుస్తారా..? హీరోయిన్ ఫైర్!

Published : May 03, 2019, 04:27 PM IST
బోల్డ్ గా నటిస్తే అలా పిలుస్తారా..? హీరోయిన్ ఫైర్!

సారాంశం

తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాల్లో నటించిన ఆశా షైనీ ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. 

తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాల్లో నటించిన ఆశా షైనీ ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లలో చాలా హాట్ గా నటించింది. తాజాగా 'సీజన్ద్ విత్ లవ్' అనే షార్ట్ ఫిలిం లో నటించింది.
దీనిపై కూడా హాట్ గా చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో మీడియా బోల్డ్ సీన్లలో నటించడం ఎలా అనిపించిందని ప్రశ్నిస్తే.. దానికి ఆమె ఆగ్రహం తెచ్చుకొని మీడియాపై ఫైర్ అయింది. బోల్డ్ సీన్లలో నటిస్తున్నందుకు  అందరూ తనను బోల్డ్ హీరోయిన్, హాట్ హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టడంతో.. అలా పిలవడంపై కూడా మండిపడింది.

సినీ ప్రముఖులు, ప్రేక్షకులు తనను అలా పిలవకూడదని, మహిళా తారలతో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పుకొచ్చింది. నటిగా అన్ని రకాల పాత్రలను  పోషించాల్సి ఉంటుందని అంత మాత్రం చేత వారిని నీచంగా చూడడం కరెక్ట్ కాదని, పాత్ర డిమాండ్ చేయడం వలనే కొన్ని సీన్లలో తప్పక నటించాల్సి ఉంటుందని తెలిపింది.

తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం పలు రకాల సినిమాల్లో నటిస్తామని, దానికి బోల్డ్ యాక్టర్ అని పిలవడం బాధగా ఉంటుందని చెప్పింది. తనతో కలిసి శృంగార సన్నివేశాలలో నటించిన హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ము మీకుందా..? అంటూ ప్రశ్నించింది. మహిళలపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా