నిత్యా నో చెప్పడంతో హీరోయిన్ పెళ్లైపోయింది!

Published : May 03, 2019, 03:56 PM ISTUpdated : May 03, 2019, 04:11 PM IST
నిత్యా నో చెప్పడంతో హీరోయిన్ పెళ్లైపోయింది!

సారాంశం

 నిత్యా నో చెప్పడం వల్ల ఒక హీరోయిన్ లైఫ్ సెట్టైపోయింది. ఆమె నిర్ణయం కారణంగా నటీనటుల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లేలా చేసింది

మలయాళం బ్యూటీ నిత్యా మీనన్ తీసుకునే నిర్ణయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా లేక చేయని నిత్యా కథ నచ్చకుంటే ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా నో చెప్పేస్తుంది. గతంలో చాలా మంది స్టార్ హీరోల ఆఫర్స్ ని నిరాకరించిన అమ్మడు మహానటి లో సావిత్రిగా నటించడానికి కూడా నో చెప్పింది. 

ఆ విషయాలన్నీ పక్కనపెడితే.. నిత్యా నో చెప్పడం వల్ల ఒక హీరోయిన్ లైఫ్ సెట్టైపోయింది. ఆమె నిర్ణయం కారణంగా నటీనటుల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లేలా చేసింది. రాజా రాణా సినిమాలో ఆర్య సరసన నటించిన నజ్రియా నజీమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే మలయాళం బెంగుళూర్ డేస్ కథలో హీరోయిన్ కోసమని మొదట నిత్యామీనన్ సంప్రదించారు. 

ఫహద్ ఫజిల్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాకి నిత్యా బిజీగా ఉండటం వల్ల నో చెప్పేసింది. ఆమె కోసం రాసుకున్న పాత్రకు చివరికి నజ్రియాని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తరువాత ఫహద్ - నజ్రియాల మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్లింది. ఈ విషయాన్నీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా తెలిపింది. నా వల్లే వారిద్దరి పెళ్లి జరిగిందని నజ్రియా ఎక్కడ కలిసినా ఈ విషయాన్నీ గుర్తు చేస్తుందని ఇష్క్ బ్యూటీ తనదైన శైలిలో వివరించింది. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌