మెగాహీరోలను మించిన హీరోలను చూశా.. ఎవరైనా తలవంచాల్సిందే: జయసుధ

Published : May 03, 2019, 03:56 PM IST
మెగాహీరోలను మించిన హీరోలను చూశా.. ఎవరైనా తలవంచాల్సిందే:  జయసుధ

సారాంశం

ఒకప్పటి హీరోయిన్ జయసుధ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తోంది.

ఒకప్పటి హీరోయిన్ జయసుధ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె 'మహర్షి' సినిమాలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో యాంకర్ 'మహేష్ బాబుకి, మెగాహీరోలకు తేడా ఏంటని..?' ప్రశ్నించింది.

దానికి ఆమె 'మెగాహీరోలు అంటే ఎవరు..?' అని ఎదురు ప్రశ్నించారు. మెగాహీరోలంటే చిరంజీవి ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అని యాంకర్ గుర్తు చేయగా.. మీడియా వారు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ మెగాఫ్యామిలీ అనుకుంటారు కానీ కో ఆర్టిస్ట్ లైన మేము అలా ఎప్పుడూ భావించమని, వారిని కూడా అందరిలానే నటులుగా చూస్తామని తెలిపారు. 

తమతో కలిసి నటించబోయే హీరోలు కొత్తవారా..? లేక నటనలో అనుభవం ఉందా..? అనే విషయాలే చూస్తాం తప్ప మెగాఫ్యామిలీ అనే తేడా ఏం ఉండదని, అంతకంటే మెగా మెగాలను చూశామని చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో చూశామని, అది పెద్ద విషయం కాదని అన్నారు.

మెగాఫ్యామిలీ నుండి వచ్చినా, మరే ఫ్యామిలీ నుండి వచ్చినా ప్రతీ ఒక్కరూ కెమెరా ముందు తలవంచాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుందని.. కొంతమంది మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. చాలా హంబుల్ గా ఉంటారని, కొంతమందికి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా యాటిట్యూడ్ చూపిస్తారని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ram Gopal Varma: మైఖేల్ జాక్సన్ అంటే అంత ద్వేషం ఎందుకు? ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప