ఫిట్‌నెస్‌లో కిర్రాక్‌ పుట్టిస్తున్న మహేష్‌..ట్రైనర్‌ ప్రశంసలు

Published : Feb 20, 2021, 08:13 AM IST
ఫిట్‌నెస్‌లో కిర్రాక్‌ పుట్టిస్తున్న మహేష్‌..ట్రైనర్‌ ప్రశంసలు

సారాంశం

ఫిట్‌నెస్‌లో మహేష్‌ ఎప్పుడూ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్ అంటున్నారు ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మినాష్‌ గబ్రియెల్‌. తాజాగా `సర్కారువారి పాట` చిత్ర షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వర్కౌట్‌ చేయిస్తూ వాహ్‌ అనిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌లో కిర్రాక్‌ పుట్టిస్తున్నారు.  

సూపర్‌ స్టార్‌ మహేష్‌ మిల్కీ బాయ్‌లా ఉంటాడు. అమ్మాయిల రాజకుమారుడని చెప్పొచ్చు. ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండే మహేష్‌ ఇంత అందానికి ఆయన ఫిట్‌నెస్‌ ఓ కారణం. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్ అంటున్నారు ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మినాష్‌ గబ్రియెల్‌. తాజాగా `సర్కారువారి పాట` చిత్ర షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వర్కౌట్‌ చేయిస్తూ వాహ్‌ అనిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌లో కిర్రాక్‌ పుట్టిస్తున్నారు.

ఈ సందర్భంగా మహేష్‌ ఫిట్‌నెస్‌ గురించి ఆయన ట్రైనర్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `సర్కారు వారి పాట` షూటింగ్‌ కోసం మేం దుబాయ్‌ వచ్చి ముప్పై రోజులైంది. ఇక్కడికొచ్చాక ఒక్క రోజు కూడా జిమ్‌ని మిస్‌ చేయలేదు మహేష్‌. షూటింగ్‌ పూర్తి చేసుకోవడం, వర్కౌట్‌ చేయడం ఆయన దిన చర్య. వర్కౌట్స్ సాయంత్రం టైమ్‌లో చేస్తున్నాం. సెట్‌లో ఎంత శ్రమించినా వర్కౌట్స్ దగ్గర రాజీపడరు. 2019 నుంచి ఆయనకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా చేస్తున్నా. గాయాలతో బాధపడి, అందులో నుంచి బయటపడి మరింత ఫిట్‌గా మారుతున్న ఆయన జర్నీ అద్భుతం. అందరి వయసు పెరుగుతున్నా, మహేష్‌ ఏజ్‌ మాత్రం తగ్గుతోంది` అని అన్నారు.

మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. దుబాయ్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌‌, జీఎంబీ ఎంటర్‌టైనర్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్