కె.విశ్వనాథ్‌ మహోన్నత దర్శకులు, ప్రతి సినిమా ఓ ఆణిముత్యంః చిరంజీవి

Published : Feb 19, 2021, 07:21 PM IST
కె.విశ్వనాథ్‌ మహోన్నత దర్శకులు, ప్రతి సినిమా ఓ ఆణిముత్యంః చిరంజీవి

సారాంశం

`గురుతుల్యులు, పితృసమానులు. మహోన్నత దర్శకులు, తెలుగుసినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన కళాతపస్వి కే విశ్వనాథ్‌గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ బర్త్ డే విషెస్‌ తెలియజేశారు మెగా స్టార్‌ చిరంజీవి.

గురువు కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. `గురుతుల్యులు, పితృసమానులు. మహోన్నత దర్శకులు, తెలుగుసినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన కళాతపస్వి కే విశ్వనాథ్‌గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యం. తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఇటీవల విశ్వనాథ్‌ని కలిసిన ఫోటోని పంచుకున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో `శభలేఖ`, `స్వయంకృషి`, `ఆపద్బాంధవుడు` వంటి చిత్రాలు వచ్చి విజయం సాధించాయి. అద్భుతమైన సంగీతానికి,  ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని మేళవించి కె.విశ్వనాథ్‌ రూపొందించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టించాయి. బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికే ఎవర్‌ గ్రీన్‌ చిత్రాలుగా నిలిచిపోయాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌