సమంత - విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ Kushi. అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ వచ్చింది. తాజాగా డేట్ కూడా అనౌన్స్ చేశారు.
‘మహానటి’ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నెని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా వంద రోజుల వరకు సమయం ఉంది.
అయితే ఇలోపు సినిమాపై ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు చిత్రంపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈక్రమంలో మ్యూజిక్ బ్లాస్ట్ కు కూడా సిద్ధం అయ్యారు. తాజాగా ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ అందించారు. తొలిపాట ‘నా రోజా నువ్వే’ Na Rojaa Nuvve అనే టైటిల్ తో రానుందని తెలిపారు. మే 9న సాంగ్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ అదేరోజు విడుదల చేయబోతున్నారు.
ఇక ‘హృదయం’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఫేమ్ అయిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం కూడా సమకూర్చుతున్నారు. దీంతో చిత్రం ఫస్ట్ సింగిల్ పై ఎగ్జైట్ పెరుగుతోంది. ఇప్పటికే ‘మ్యూజిక్ బ్లాస్ట్’ అంటూ ఇచ్చిన అప్డేట్ లో ‘ఖుషీ’ టైటిల్ సాంగ్ కు సంబంధించిన బీజీఎం అదిరిపోయిన విషయం తెలిసిందే. చిత్రంలో సంగీత దర్శకుడు మరింతగా మెలోడీని అందించబోతున్నట్టు మాత్రం అర్థం అవుతోంది.
ఇక చాలా కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ‘లైగర్’ దారుణంగా ఫెయిల్యూర్ అయిన విషయం తెలిసిందే. అయినా ఆయన జోరు, క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక సమంత కూడా రీసెంట్ గా వచ్చిన ‘శాకుంతలం’కూడా డిజాస్టర్ గా మారింది. ఈ క్రమంలో ఇద్దరికీ ‘ఖుషి’ చిత్రం ప్రధానంగా మారింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా సినిమాగా రాబోతుండటంతో ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నారనేది చూడాలి.
Musical blast begins with the first single of on May 9th❤️🔥
In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️ pic.twitter.com/1kSZou8xn1