మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. డేట్, టైం ఫిక్స్.!

By team teluguFirst Published Sep 13, 2022, 1:51 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (Godfather) రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదలపై అప్డేట్ అందింది.  
 

2019 మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’గా తెరకెక్కబోతోంది. గతేడాది జనవరిలో హైదరాబాద్ లోనే చిత్రాన్ని ప్రారంభించారు. మూవీకి మోహన్ రాజా దర్శకత్వ వహిస్తున్నారు. 20 ఏండ్ల తర్వాత మోహన్ రాజా.. చిరంజీవిని డైరెక్ట్ చేసి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఈయన ‘హనుమాన్ జంక్షన్’ను తెరకెక్కించారు. ప్రస్తుతం Godfather చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

ఈ సందర్భంగా మేకర్స్ ఒక్కో అప్డేట్ ను రివీల్ చేస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రం ఫస్ట్ సింగ్ పై క్రేజీ అప్డేట్ అందింది. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ ప్రొమోను రిలీజ్ చేయనున్నారు. 15వ తేదీన సాయంత్రం 4 : 05 నిమిషాలకు పూర్తి పాటను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. అయితే ఫస్ట్ సింగిల్ లోనే సల్మాన్ ఖాన్  కూడా ఉండబోతున్నట్టు  సమాచారం. దీంతో మెగా స్టార్ ఫ్యాన్స్, అటు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాంగ్ ఎలా ఉండబోతుందోనని ఎగ్జైట్ ఫీలవుతున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందిస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman) ‘గాడ్ ఫాదర్’కు కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించినట్టు తెలుస్తోంది. ఫస్ట్ సింగ్ లో థమన్ మ్యూజిక్ దిమ్మతిరిగిపోతుందని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్బీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ (Salman Khan) గెస్ట్ రోలో నటించారు.  నయనతారా హీరోయిన్ గా నటించింది. పూరీ జగన్నాథ్, సత్యదదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, గంగవ్వ ఆయా పాత్రల్లో కనిపించనున్నారు.

 

Finally here comes the most awaited update from the team pic.twitter.com/Hhp2XEZdqS

— God🔥Father (@Krishnasaride)
click me!