`గాడ్‌ ఫాదర్‌` ఫస్ట్ సింగిల్‌ ప్రోమో.. చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కలిసి స్టెప్పేస్తే ఫ్యాన్స్ కి పూనకాలే

Published : Sep 13, 2022, 06:40 PM ISTUpdated : Sep 13, 2022, 06:41 PM IST
`గాడ్‌ ఫాదర్‌` ఫస్ట్ సింగిల్‌ ప్రోమో.. చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కలిసి స్టెప్పేస్తే ఫ్యాన్స్ కి పూనకాలే

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌` నుంచి అదిరిపోయే సాంగ్‌ రాబోతుంది. మొదటి సాంగ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. 

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు మరో ట్రీట్‌ ఇచ్చేందుకు వస్తున్నారు. ఇటీవల ఆయన `ఆచార్య`తో డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో `గాడ్‌ ఫాదర్‌`తో ఆ లోటుని పూడ్చేందుకు వస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `లూసీఫర్‌` చిత్రానికిది రీమేక్‌. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సత్యదేవ్‌ మరో కీ రోల్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి విడుదల కాబోతుంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్. 

అందులో భాగంగా `గాడ్‌ ఫాదర్‌` గ్లింప్స్ ని విడుదల చేశారు. ఆది ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌` అంటూ సాంగే పాటని ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. కిడ్స్ రైమ్స్  పల్లవితో వచ్చే ఈ పాట ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ ఎంట్రీ తీరు ఆకట్టుకుంటుంది. 

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఇద్దరు మెగాస్టార్లు మొదటి సారి కలిసి నటించిన చిత్రమిదని చెబుతూ, `తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌` అంటూ సాగే ఈ పాట ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఇది ఇద్దరు హీరోల అభిమానులకు ఒక ఫీస్ట్ లాంటి సాంగ్‌గా ఉండబోతుందని, అలాగే సినిమా సైతం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండబోతుందని తెలుస్తుంది. 

ఇందులో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కీలకపాత్ర పోషిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు హిందీలోనూ భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు