
ఫ్రెంచ్ సినిమాని కొత్త పుంథలు తొక్కించి, ఆ దేశ సినిమా కొక గాడ్ ఫాదర్‌గా నిలిచిన ఫ్రాన్స్-స్విస్ దర్శకుడు జీన్ లూక్ గొడార్డ్(91) కన్నుమూశారు. మంగళవారం ఆయన కన్నుమూసినట్టు లిబరేషన్ పేపర్ తెలిపింది. `బ్రీత్ లెస్`, `కాంటెంప్ట్` చిత్రాలతో ఆయన విశేషంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1960లో ఫ్రెంచ్ సినిమాని కొత్త పుంథలు తొక్కించారు. మూసధోరణిలను బ్రేక్ చేస్తూ కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఫ్రెంచ్ సినిమాని శాషించారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆ దేశ సినిమాని ప్రపంచ పోటీదారుగా మార్చేశారు.
సినిమా కథల్లోనే కాదు, మేకింగ్‌లోనూ సంచలనాలు సృష్టించారు. హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్, సౌండింగ్, జంప్ కంట్‌లు, అస్తిత్వ సంభాషణలతో సినిమా నిర్మాణానికి సంబంధించిన కొత్త మార్గాన్ని ప్రారంభించారు. ఫ్రెంచ్ సినీ చరిత్రలో గాడ్ ఫాదర్‌గా నిలిచిపోయారు. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, ఫిల్మ్ క్రిటిక్‌గా ఆయన విశేషంగా సేవలందించారు. ఫిల్మ్ క్రిటిక్‌గా ఉన్నప్పుడు మూసధోరణిలో సాగుతున్న, సాంప్రదాయంగా సాగుతున్న ఫ్రెండ్ సినిమాపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కేవలం విమర్శించడమే కాదు, తాను చేసి చూపిస్తా అంటూ సినిమా మేకింగ్‌లోకి అడుగుపెట్టి సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. 1960లో తీసిన `బ్రీత్‌లెస్` మూవీ ఫ్రెంచ్ సినిమా కొత్త పుంథలు తొక్కేందుకు నాంది పలికిందని చెప్పొచ్చు. తన సినిమాల ద్వారా సామాజిక, రాజకీయ మార్పులకు, అవగాహనలకు దోహదపడ్డారు. అస్తిత్వం, మార్క్సిస్ట్ తత్వశాస్త్ర పాఠకుడిగా రాడికల్ భావాలతో ఉండేవారు గోడార్డ్. ఆ తర్వాత ఆయన మానవతావాదిగా, మార్క్సిస్ట్ ఐడియాలిజీని సినిమాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ సామాజిక మార్పుకి కృషి చేశారు.
ఫిల్మ్ మేకర్‌గా ఆయన `బ్రీత్‌లెస్`తోపాటు `ది లిటిల్ సోల్జర్`, `మై లైఫ్ టూ లైవ్`, `ఏ ఉమెన్ ఈజ్ ఏ ఉమెన్`, `ది కరేబినీర్స్`, `కాంటెంప్ట్`, `బ్యాండ్ ఆఫ్ ఔట్ సైడర్స్`, `ఏ మ్యారీడ్ ఉమెన్`, `వీక్ ఎండ్` చిత్రాలను రూపొందించారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ 1980లో `ప్యాషన్`, `ఫస్ట్ నేమ్‌ఃకార్మెన్`, `హైల్ మేరీ`, `కింగ్ లీర్`, `కీప్ యువర్ రైట్ అప్` వంటి సినిమాలు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. అనేక లఘు చిత్రాలు కూడా చేశారు.
గొడార్డ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట 1961లో స్టార్ హీరోయిన్ `అన్నా కరీనాని వివాహం చేసుకోగా, నాలుగేండ్లకే విడిపోయారు. ఆ తర్వాత 1967లో మరో నటి అన్నే వియాజెమ్క్సీని వివాహం చేసుకున్నారు. ఆమెకి 1979లో విడాకులిచ్చారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నే మేరీ మియావిల్లేతో సహజీవనం చేస్తున్నారు. ఆయన సేవాలకుగానూ అనేక అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. జీన్ లూక్ గొడార్డ్ మరణం ఫ్రెంచ్ సినిమాకి చీకటి రోజుగా వర్ణిస్తుంది ప్రపంచ మీడియా. గాడ్ ఫాదర్‌ని కోల్పోయామని ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది.