విరాటపర్వం నుండి ఫస్ట్ సింగిల్... సాయి పల్లవి లుక్ అదిరింది!

Published : Feb 22, 2021, 05:20 PM ISTUpdated : Feb 22, 2021, 05:25 PM IST
విరాటపర్వం నుండి ఫస్ట్ సింగిల్... సాయి పల్లవి లుక్ అదిరింది!

సారాంశం

విరాటపర్వం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. హీరోయిన్ సాయి పల్లవిపై తెరకెక్కిన 'కోలు కోలు..' అంటూ సాగే సాంగ్ లిరికల్ ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. ఇక ప్రకటన పోస్టర్ లో సాయి పల్లవి లుక్ మనసును కట్టిపడేసేలా ఉంది.


దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం విరాటపర్వం. పీరియాడిక్ లవ్ అండ్ రివొల్యూషనరీ డ్రామాగా తెరకెక్కుతుంది. యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు వుడుగుల విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కెరీర్ లో మొదటిసారి రాణా నక్సలైట్ రోల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. 


హీరోయిన్ సాయి పల్లవిపై తెరకెక్కిన 'కోలు కోలు..' అంటూ సాగే సాంగ్ లిరికల్ ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. ఇక ప్రకటన పోస్టర్ లో సాయి పల్లవి లుక్ మనసును కట్టిపడేసేలా ఉంది. పచ్చని పరికిణీ, పసుపు ఓణీలో డాన్స్ చేస్తున్న సాయి పల్లవి ఆకట్టుకున్నారు. సాయి పల్లవి విరాటపర్వం మూవీలో నక్సల్ సానుభూతిపరురాలైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. 


షూటింగ్ దశలో ఉన్న విరాటపర్వం మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. భారతక్క అనే లేడీ నక్సల్ గా ఆమె కనిపించనున్నారు. అనేక ప్రత్యేకతలు కలిగిన విరాటపర్వం మూవీ ఏప్రిల్ 30న గ్రాండ్ గా విడుదల కానుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut: ప్రభాస్ హీరోయిన్ బంగ్లా ఇన్సైడ్ ఫోటోలు ..కాంట్రవర్సీల క్వీన్ ఇల్లు చూశారా
Sreeleela Career: అందం, టాలెంట్ ఉన్నా ఈ హీరోయిన్‌కు అవకాశాల్లేవా? కారణం తెలిస్తే షాకవుతారు!