కేంద్ర మంత్రిపై హీరో సిద్దార్థ్ సెటైర్... సిద్ధాంతాలు లేవంటూ ఘాటుగా!

Published : Feb 22, 2021, 03:49 PM IST
కేంద్ర మంత్రిపై హీరో సిద్దార్థ్ సెటైర్... సిద్ధాంతాలు లేవంటూ ఘాటుగా!

సారాంశం

డీజిల్ మరియు పెట్రోల్ ధర లీటరు రూ. 100కి చేరువయ్యింది. ప్రతిపక్షాలు, ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో హీరో సిదార్ద్ సైతం తన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై ఆమె సెటైర్ వేశారు.   

దేశంలో పెట్రోల్ ధర రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ మరియు పెట్రోల్ ధర లీటరు రూ. 100కి చేరువయ్యింది. ప్రతిపక్షాలు, ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో హీరో సిదార్ద్ సైతం తన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై ఆమె సెటైర్ వేశారు. 


పెట్రోల్ ధరల విషయంలో గతంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు జత చేస్తూ ఓ కామెంట్ చేశారు. నమ్మిన సిద్ధాంతానినకి కట్టుబడి ఉండడంలో మామి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఉల్లిపాయలు లేవు, సిద్ధాంతాలు లేవు, గుర్తు కూడా లేదు.. మామి రాక్స్... అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సిద్దార్థ్ ట్వీట్ అటు రాజకీయవర్గాలతో పాటు, సినీవర్గాలలో ఆసక్తికరంగా మారింది. 


నటుడు ప్రకాష్ రాజ్ వలె సిద్దార్థ్ ఎప్పటికప్పుడు, సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. మరోవైపు సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం మూవీలో ఆయన సెకండ్ హీరోగా నటిస్తున్నారు. మహాసముద్రం చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?