
రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది.
ప్రస్తుతం రాఖీ సావంత్ కి ఆమె భర్త ఆదిల్ కి మధ్య పెద్ద వివాదమే జరుగుతోంది. తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని.. తనని మోసం చేస్తున్నాడు అంటూ రాఖీ సావంత్ ఆరోపిస్తోంది. ఆదిల్ పై రాఖీ సావంత్ కేసు కూడా నమోదు చేసింది. ఆదిల్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఆదిల్ పై మరో సంచలన కేసు నమోదైంది. మైసూరులో ఆదిల్ దురానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇరాన్ కి చెందిన ఓ యువతి ఆదిల్ పై రేప్ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 కింద ఆదిల్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం ఆదిల్ 14 రోజుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది.
సదరు యువతి ఎఫ్ఐఆర్ లో..ఆదిల్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఐదు నెలల క్రితం తనని వివాహం చేసుకోమని అడగగా ఆదిల్ అందుకు తిరస్కరించాడు. ఇలాంటి రేలషన్ షిప్స్ ఆదిల్ కి చాలా మంది యువతులతో ఉన్నాయని ఆ తర్వాత తెలిసినట్లు ఆ యువతి పేర్కొంది.
ఇదిలా ఉండగా రాఖీ సావంత్ కూడా ఆదిల్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అతడిపై గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. కొన్ని రోజుల క్రితం రాఖీ సావంత్ తన తల్లిని కూడా కోల్పోయింది. రాఖీ సావంత్ తల్లి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.