
భారతదేశపు నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్య క్రియలు నిర్వహించనున్నారు.
బాలీవుడ్ స్వరదిగ్గజం,భారతదేశపు నైటింగేల్‌గా పేరుపొందిన మంగేష్కర్ అంత్యక్రియల కోసం శివాజీ పార్క్‌లో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు మంగేష్కర్ చివరి చూపు కోసం ఇప్పటికే ఇంటి వద్ద చాలా మంది అభిమానులు గుంపులుగా చేరుకున్నారు. అయితే శివాజీ పార్కు వద్ద అంత్యక్రియల ఏర్పాట్లను మహారాష్ట్ర క్యాబినేట్ మినిస్టర్ ‘ఆదిత్యా ఠాక్రే’ పరిశీలిస్తున్నారు. ప్రధాని మోడీ హాజరవుతున్న సందర్భంగా ఎలాంటిి లోటుపాటు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు, సలహాలు అందించారు.
మంగేష్కర్ అంత్యక్రియల్లో ప్రధాని మోడీతో ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు కూడా హాజరు కానున్నట్టు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నమెంట్ ముంబైలో భద్రతా బలగాలను అన్ని విధాలుగా సిద్ధం చేసింది. ఎలాంటి ఆందోళన పరిస్థితులు ఏర్పడకుండా సెక్యూరిటీని కేటాయించింది. ముఖ్య మంత్రితో పాటు సాయంత్రం 6.15 గంటలకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆమె స్మారకార్థం ఆదివారం, సోమవారం రెండు రోజులు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అరగంట పాటకు ఎగురవేస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.
అంత్యక్రియలకు ప్రధాని కొద్దిగంటల్లో మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకోనున్నారు. అక్కడికి చేరుకోగానే ముందుగా మంగేష్కర్ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు ప్రధాని మోడీ. లతాజీ మరణ వార్త విన్న వెంటనే ప్రధాని ‘ట్విట్టర్’లో నివాళి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖులు అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్ అంతిమ నివాళి అర్పించేందుకు ఆమె ఇంటికి చేరుకున్నారు.