‘లక్ష్మీస్ ఎన్టీఆర్’:ఎట్టకేలకు ఆంధ్రాలో రిలీజ్

Published : Apr 10, 2019, 11:17 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’:ఎట్టకేలకు ఆంధ్రాలో రిలీజ్

సారాంశం

వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు  మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండువారాల క్రితం  తెలంగాణలో విడుదలైంది. 

వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు  మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండువారాల క్రితం  తెలంగాణలో విడుదలైంది. కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్‌ ఆగి పోయింది. వర్మ తనదైన శైలిలో ఈ సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్  తెచ్చాయి.

అయితే తమ సినిమా ద్వారా  టార్గెట్ చేసిన ఏపీ లో మాత్రం రిలీజ్ కాలేదు. ఎలక్షన్స్ టైమ్ లో రిలీజ్ అయితే దాని ఇంపాక్ట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ కోర్టు తీర్పుతో సినిమా ఆంధ్రా ధియోటర్స్ చేరలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ దాటాక అంటే ఈ శుక్రవారం ఈ సినిమా ఆంధ్రాలో రిలీజ్ కానుంది. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు. ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది

 

ఇక  తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో...బాగుందని టాక్ రావటంతో ఈ చిత్రంపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.  ఈ నేపధ్యంలో  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  పైరసీ వెర్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి చాలా మంది డౌన్ లోడ్ చేసుకుని మరీ చూసేసారని సమాచారం. రిలీజైన రోజు రాత్రికు ఈ సినిమా పైరసీ వెర్షన్ మంచి కాపీతో జనాల ల్యాప్ టాప్ లపై వాలిపోయింది. దాంతో  తొలి రోజు రాత్రికల్లా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని జనాలు చూడటం, మాట్లాడుకోవటం మొదలెట్టారు. 

మరో ప్రక్క ఫేస్ బుక్ లో ను ఫుల్ సినిమాని కొందరు పోస్ట్ చేసేసారు. వాట్సప్ లో బిట్లు బిట్లుగా ఈ సినిమాను హల్ చల్ చేస్తోంది. ఇలా పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించి, అలరించింది. ఇలా జనం రకరకాలుగా ఈ సినిమాని చూసేసిన నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ మాత్రం ఆంధ్రా  జనాలను అలరిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?