ఎట్టకేలకు దృశ్యం 2 అప్డేట్ ఇచ్చిన వెంకటేష్!

Published : Sep 18, 2021, 02:39 PM ISTUpdated : Sep 18, 2021, 02:52 PM IST
ఎట్టకేలకు దృశ్యం 2 అప్డేట్ ఇచ్చిన వెంకటేష్!

సారాంశం

దృశ్యం 2 నుండి అప్డేట్ రావడం జరిగింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్, 20 సెప్టెంబర్ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే మోషన్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారట.

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ చకచకా చిత్రాలు చేస్తున్నారు. రీమేక్స్, స్ట్రెయిట్ ఫిలిమ్స్ అనే తేడా లేకుండా... నెలల వ్యవధిలో షూటింగ్ పూర్తి చేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వెంకీ నటించిన నారప్ప మూవీ ఓటిటిలో విడుదల కావడం జరిగింది.

తమిళ్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా వెంకటేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2 సైతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అతి తక్కువ సమయంలో వెంకీ దృశ్యం 2షూటింగ్ పూర్తి  చేశారు. దృశ్యం చిత్రానికి ఇది సీక్వెల్ కాగా, మొదటి పార్ట్ లో కూడా వెంకటేష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

కాగా దృశ్యం 2 నుండి అప్డేట్ రావడం జరిగింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్, 20 సెప్టెంబర్ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే మోషన్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారట. మరి మళయాలంలో ఆల్రెడీ బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహించారు. వెంకటేష్ కి జంటగా మీనా మరొమారు నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

2025 లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన 8 సినిమాలు, అందులో టాలీవుడ్ మూవీస్ ఎన్ని?
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు