స్టెరాయిడ్స్ అమ్మిన నటుడు, ఆపై సూసైడ్ అటెంప్ట్.. మరో నటుడిపై కేసు

pratap reddy   | Asianet News
Published : Sep 18, 2021, 01:18 PM IST
స్టెరాయిడ్స్ అమ్మిన నటుడు, ఆపై సూసైడ్ అటెంప్ట్.. మరో నటుడిపై కేసు

సారాంశం

ప్రముఖ మోడల్, బాడీబిల్డర్ అయిన నటుడు మనోజ్ పాటిల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.

ప్రముఖ మోడల్, బాడీబిల్డర్ అయిన నటుడు మనోజ్ పాటిల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.వివరాల్లోకి వెళితే.. మనోజ్ పాటిల్ ఓషిరావాలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ కి ప్రయత్నించాడు. 

దీనితో మనోజ్ కుటుంబ సభ్యులు అతడికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మనోజ్ పాటిల్ కుటుంబ సభ్యులు మరో నటుడు సాహిల్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. సాహిల్ ఖాన్ వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని మనోజ్ తల్లి ఆరోపించారు. 

దీనితో సాహిల్ మీడియా కుందుకు వచ్చి జరిగిన సంఘటనలో తన వర్షన్ వివరించాడు. రెండేళ్ల క్రితం మనోజ్ కి, తనకు సోషల్ మీడియా ద్వారా రాజ్ ఫాజ్ ధార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మనోజ్ అతడి వద్ద రూ 2 లక్షలు తీసుకుని స్టెరాయిడ్స్ అమ్మాడు. అయితే ఆ స్టెరాయిడ్స్ గడువు ముగిసినవి. 

దీనితో రాజ్ కు గుండె సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తాయి. దీనితో రాజ్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని మనోజ్ ని కోరాడు.కానీ మనోజ్ అతడి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో సాయం చేయమని రాజ్ నన్ను కోరడంతో మనోజ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. అంతకు మించి నేనేమి ఇన్వాల్వ్ కాలేదని సాహిల్ పేర్కొన్నాడు. 

అయితే ఈ సంఘటనకు ముందే సాహిల్ సోషల్ మీడియాలో తన ఇమేజ్ ని దెబ్బ తీస్తున్నాడుఅంటూ అతడిపై మనోజ్ కేసు పెట్టాడట. ఈ విషయాన్ని మనోజ్ మేనేజర్ మీడియాకు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri: బిగ్‌బాస్‌లో రీతూ రోత పనులు చూడలేకపోయాను, అందుకే ప్రశ్నించాల్సి వచ్చింది
Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?