భిక్షాటన చేస్తోన్న టాప్ డైరెక్టర్!

First Published 12, Sep 2018, 12:16 PM IST
Highlights

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కాలం కలిసి రాకపోతే రోడ్డున పడడం ఖాయం. ఇదే పరిస్థితి ఓ స్టార్ డైరెక్టర్ కి వచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఆలయం వద్ద బిక్షాటన చేస్తూ కనిపించడం సినీ పరిశ్రమని కలిచివేస్తోంది.

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కాలం కలిసి రాకపోతే రోడ్డున పడడం ఖాయం. ఇదే పరిస్థితి ఓ స్టార్ డైరెక్టర్ కి వచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఆలయం వద్ద బిక్షాటన చేస్తూ కనిపించడం సినీ పరిశ్రమని కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. అలనాటి మహానటుడు ఎంజీఆర్ హీరోగా 'నమ్మనాడు' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు జంబులింగం కొడుకు సెంథిల్ నాథన్ సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత విజయ్ కాంత్ నటించిన 'పూందోట్ట కావల్‌క్కాన్‌' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఆ తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఉన్నై నాన్' అనే సినిమా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసింది. ఆ సినిమా విడుదల కూడా కాలేదు. దీంతో బుల్లితెరపై సీరియళ్లతో తన కెరీర్ సాగించారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన సీరియళ్ల నుండి ఆయన్ని తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అయన ఇంటి నుండి కంచికి వెళ్లిపోయారు.

అక్కడ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన కొందరు నిర్మాతలు ఆయన్ని తిరిగి చెన్నైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. సూసైడ్ చేసుకుంటానని బెదిరించారు సెంథిల్ నాథన్. దీంతో వారు కాంచీపురం పోలీసులకు సమాచారం అందించగా.. వారు సెంథిల్ నాథన్ ని చెన్నైకి తీసుకొచ్చారు.  
 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST