షాకింగ్ న్యూస్..  ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మృతి

Published : Jul 10, 2021, 05:53 PM ISTUpdated : Jul 10, 2021, 06:01 PM IST
షాకింగ్ న్యూస్..  ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మృతి

సారాంశం

కారు ప్రమాదానికి గురై చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కత్తి మహేష్ మృతి చెందారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. 

ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు. గత నెలలో కారు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. దీనితో ఆయన చికిత్స తీసుకుంటూ నేడు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. 


నెల్లూరు సమీపంలో ప్రధాన జాతీయ రహదారిపై లారీని కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు వెనుకనుండి ఢీ కొనడం జరిగింది. ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే సీట్ బెల్ట్ ధరించని కారణంగా కత్తి మహేష్ తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. 


అతని చికిత్స కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 17లక్షలు సీఎం సహాయ నిధి నుండి విడుదల చేయడం జరిగింది. కత్తి మహేష్ కి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన మరణించారు. కత్తి మహేష్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?