భార్యని కాదని.. బీచ్ లో సింగర్ తో హీరో రొమాన్స్!

By Udaya DFirst Published Apr 12, 2019, 12:48 PM IST
Highlights

బాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు ఓ సింగర్ ప్రేమలో పడి ఆమెతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

బాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు ఓ సింగర్ ప్రేమలో పడి ఆమెతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫర్హాన్ కి ఇదివరకే పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు.

కానీ తన తోటి సింగర్ షిబాని దండేకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు ఫర్హాన్. అది కూడా అందరికీ తెలిసేలానే.. ఇటీవల ఈ జంట మెక్సికోకు వెళ్లింది. అక్కడ బీచ్ ఒడ్డున వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బికినీ వేసుకొని ఉన్న షిబానీని ఫర్హాన్ వెనుక నుండి హత్తుకొని ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇంట్లో వయసొచ్చిన ఇద్దరు కూతుళ్లను పెట్టుకొని ఇవేం పనులంటూ ఫర్హాన్ ని విమర్శిస్తున్నారు.

షిబానీ విషయంలో ఫర్హాన్ ఫ్యామిలీ కూడా సీరియస్ ఉందని టాక్. మొదటి భార్యతో కలిసి ఉంటూ ఇలా మరొకరితో లవ్ ఎఫైర్ సాగించడం పట్ల బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తోంది. 


 

click me!