ప్చ్.. మోక్షజ్ఞ గెటప్ తో నందమూరి ఫ్యాన్స్ అప్సెట్!

By Udaya DFirst Published Apr 11, 2019, 3:13 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసి తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు.

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసి తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. చాలా రోజులుగా బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నాడు కానీ ఇప్పటివరకు అది జరగలేదు.

2018లో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అన్నారు.. ఆ తరువాత విదేశాల్లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే బాలయ్య మాత్రం మోక్షజ్ఞని పబ్లిక్ లోకి తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అప్పుడప్పుడు మాత్రం మోక్షజ్ఞ ఫోటోలు లీక్ అవుతున్నాయి.

తాజాగా మోక్షజ్ఞకి సంబంధించి ఓ ఫోటో లీకైంది. అందులో మోక్షజ్ఞ గెటప్ చూసిన నందమూరి  అభిమానులు పెదవి విరుస్తున్నారు. మోక్షజ్ఞ మాములుగా వ్యక్తిగా ఉన్నాడే తప్ప.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. తనలో ఎలాంటి మేకోవర్ కనిపించడం లేదు. 

దీంతో అసలు మోక్షజ్ఞ ఇప్పట్లో హీరోగా కనిపిస్తాడా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మోక్షజ్ఞ వయసు గల చాలా మంది వారసులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఈ విషయంలో బాలయ్య ఏం ఆలోచిస్తున్నారో!  

click me!