కార్యకర్త అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన హీరోయిన్!

Published : Apr 11, 2019, 02:19 PM IST
కార్యకర్త అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన హీరోయిన్!

సారాంశం

సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల కోసం కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో సినీ తారలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. 

సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల కోసం కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో సినీ తారలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొందరు సినీతారలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతిచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.

సినీ నటి ఖుష్బూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంది. బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్ కి మద్దతుగా ఆమె ఏప్రిల్ 10న ప్రచారం నిర్వహించారు.  ప్రచారమనంతరం ఆమె ఇంటికి వెళ్లడానికి కారు దగ్గరకి వెళ్తుండగా.. అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరారు. 

ఖుష్బూ కారు ఎక్కేందుకు వెళుతుండగా.. ఆమెని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. అక్కడున్న పోలీసులకు కూడా వారిని అదుపుచేయడం కుదరలేదు. ఆ సమయంలో ఓ కార్యకర్త ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

వెంటనే ఆమె సదరు కార్యకర్త చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం  ఖుష్బూ.. విశాల్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం
Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్‌ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు