హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్, అభిమానుల ఘన స్వాగతం, ఆస్కార్ పై తారక్ ఎమోషనల్ స్పీచ్

Published : Mar 15, 2023, 09:27 AM ISTUpdated : Mar 15, 2023, 09:34 AM IST
హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్, అభిమానుల ఘన స్వాగతం, ఆస్కార్ పై తారక్ ఎమోషనల్  స్పీచ్

సారాంశం

ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళి.. హాలీవుడ్ లో సందడి చేసిన మన ఆర్ఆర్ఆర్ స్టార్స్.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి వచ్చారు. ఆస్కార్ గురించి భావోద్వేగంతో మాట్లాడారు.

మొత్తానికి ఆస్కార్ హడావిడి ముగిసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మరచిపోలేని బహుమతిని అందించారు జక్కన్న టీమ్. కొంత కాలంగా అమెరికాలో ఆస్కార్ ఎంట్రీ కోసం.. ఆతరువాత  ఆస్కార్ గెలవడం కోసం ఎంతో కష్టపడ్డారు రాజమౌళి టీమ్. ఈక్రమంలో ఆస్కార్ సాధించిన సంతోషంలో స్పెషల్ గా పార్టీ కూడా చేసుకున్నారు . ఇక ఒక్కొక్కరుగా లాస్ ఏంజిల్ నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈక్రమంలో ముందుగా ఈరోజు హైదరాబాద్ లో అడుగు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తారక్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ ఆస్కార్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భావోద్వేగంతో ప్రసంగించారు. 

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకున్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను.. ముఖ్యంగా కీరవాణి, చంద్రబోస్ స్టేజ్ మీద ఆస్కార్ తీసుకున్న క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అన్నారు ఎన్టీఆర్. ఈ వేడుకల్లో భాగం అయినందకు చాలా సంతోషంగా ఉంది. నాజీవితంలో ఇవి బెస్ట్ మూమెంట్స్..మన దేశంలాగానే ఈ అవార్డ్ కూడా గొప్పగా ఉంది. ఇదోక అద్భుతమైన అనుభవం.. ఈ సంతోషాన్ని మాట్లల్లో చెప్పలేను అంటూ.. ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. అంతే కాదు భారతీయుడిని.. అందులోను తెలుగువాడిగా పుట్టినందకు గర్విస్తున్నాను అన్నారు తారక్. 

 

మేము ఇంతటి ఘనత సాధించాము అంటే దానికి కారణం అభిమానులు, ప్రేక్షకులు. మమ్మల్ని ఇంతలా ఆదరించిన మీవల్లే ఇది సాధ్యం అయ్యింది. రాజమౌళి చేతిలో ఆస్కార్ ను చూసినప్పుటు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన కష్టం వృధా కాలేదు. ఇక  ఆస్కార్ కోసం తమను ప్రోత్సహించిన సినీ ప్రేమికులకు, అందరికి పేరు పేరున కృతజ్ఞతు తెలిపారు ఎన్టీఆర్. అవార్డ్ వచ్చిన వెంటనే తాను తన భార్యకు ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నట్టు తెలిపారు ఎన్టీఆర్. 

 

బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తానికి ఆస్కార్ సాధించింది నాటు నాటు సాంగ్. ప్రపంచ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డ్ ను అందుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం.. హాలీవుడ్ లో తెగ సందడి చేశారు రామ్ చరణ్ , ఎన్టీఆర్. దాంతో ఈ ఇద్దరు తెలుగు హీరోలు అమెరికాలో అందరిని ఆకర్షించారు. హాలీవుడ్ దిగ్గజాలు కూడా వీరిపై ప్రశంసల వర్షంకురిపించారు. అటు అమెరికన్ మీడియా కూడా వీరికి భారీగా పబ్లిసిటీ ఇచ్చింది. ఎటు చూసినా..నాటునాటు పాట మారుమోగింది. ఆ పాటకు డాన్స్ చేసిన ఇండియన్ హీరోలను అంతా ఆకాశానికి ఎత్తారు.  దాంతో  చరణ్-తారక్ లకు గ్లోబల్ ఇమేజ్ వచ్చేసింది. హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఈ ఇద్దరి గురించి తెగ మాట్లాడారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే