ఆస్కార్ లో అరుదైన రికార్డ్ సాధించిన ఎన్టీఆర్, హాలీవుడ్ హీరోలను పక్కకు నెట్టి..

Published : Mar 15, 2023, 08:36 AM ISTUpdated : Mar 15, 2023, 09:37 AM IST
ఆస్కార్ లో అరుదైన రికార్డ్ సాధించిన ఎన్టీఆర్,  హాలీవుడ్ హీరోలను పక్కకు నెట్టి..

సారాంశం

ఆస్కార్ లో ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ సాధించారు. అసలు ఆస్కార్ అందుకోని తారక్.. ఆస్కార్ లో రికార్డ్ సాధించడం ఏంటీ..? అని అందరకి అనుమానం రావచ్చు. అవును తారక్ నిజంగా రికార్డ్ క్రియేట్ చేశాడు.  ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే..? 


బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాట.. మొత్తానికి ఆస్కార్ సాధించింది. కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డ్ ను అందుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం.. హాలీవుడ్ లో తెగ సందడి చేశారు రామ్ చరణ్ , ఎన్టీఆర్. దాంతో ఈ ఇద్దరు తెలుగు హీరోలు అమెరికాలో అందరిని ఆకర్షించారు. హాలీవుడ్ దిగ్గజాలు కూడా వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. అటుఅమెరికన్ మీడియా కూడా వీరికి భారీగా పబ్లిసిటీ ఇచ్చింది. ఎటు చూసినా..నాటునాటు పాట మరుమోగింది. ఆ పాటకు డాన్స్ చేసిన ఇండియన్ హీరోలను అంతా ఆకాశానికి ఎత్తారు.  


ఈక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరోలు చరణ్-తారక్ లకు గ్లోబల్ ఇమేజ్ వచ్చేసింది. హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఈ ఇద్దరి గురించి తెగ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలు తమ మాటకారితనంతో.. డ్రస్సింగ్ స్టైల్ తో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక నందమూరి హీరో ఎన్టీఆర్ అయితే ఈ విషయంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆస్కార్ అవార్డుల వేడుకు జరుగుతున్న టైమ్ లో మన తెలుగు హీరోల గురించి అక్కడ ఎక్కువగా డిస్కర్షన్ జరిగిందట. ఇద్దరు హీరోల గురించే ఎక్కువగా హాలీవుడ్ మేకర్స్ మాట్లాడుకున్నారట. ఈ విషయంలో ఎన్టీఆర్ టాప్ లో నిలిచాడు. చరణ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 

నెట్ బేస్ క్విడ్ అనే డేటా విశ్లేషణ సంస్థ రిలీజ్  చేసిన సర్వే వివరాల ప్రకారం.. ఆస్కార్ వేడుక జరుగుతున్న టైంలో సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అందరికంటే ఎక్కువగా మెన్షన్ చేసిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ సాధించగా.. రామ్ చరణ్ రెండో స్థానం సంపాదించుకున్నాడు. ఆతరువాత స్థాన్నాల్లో ఎవ్రీథింగ్ నటుడు కె హ్యూయ్ ఖాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ విషయాన్ని పోస్టర్ రూపంలో రిలీజ్ చేసింది నెట్ బేస్ క్విడ్  సంస్థ .ఈ రిపోర్ట్ లో ఇంకా అనేక విషయాలను వెల్లడించింది సంస్థ. 

 

 అలా ఈసారి ఆస్కార్ వేడుకని సుమారు 18.7 మిలియన్ల మంది చూశారట. ఏబీసీ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్  ప్రకారం.. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది అవార్డుల కార్యక్రమం చూసిన వారి సంఖ్య 12 శాతం పెరిగింది. మరోవైపు దాదాపు 1.05 మిలియన్ల మంది ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్  @tarak9999 ని మెన్షన్ చేశారు. ఇలా ఈ విషయంలోనూ నందమూరి హీరో టాప్ ప్లేస్ లో నిలిచాడు. దాంతో ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. 

ఆస్కార్ బరిలో నిలిచి.. గెలిచిన తరువాత.. సొంత గడ్డపై ఈరోజు అడుగు పెట్టబోతున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. జక్కన్న బృందానికి ఘన స్వాగతం పలకడానికి ఇండియా అంతా ఎదురుచూస్తోంది. అంతే కాదుతెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మిన్నంటిపోయాయి. రాజమౌళి టీమ్ కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు సీనీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి