'జల్సా' స్పెషల్ షోలకు వచ్చిన రూ.1 కోటిని ఫ్యాన్స్ ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ ఫిదా..

Published : Nov 17, 2022, 07:53 PM IST
'జల్సా' స్పెషల్ షోలకు వచ్చిన రూ.1 కోటిని ఫ్యాన్స్ ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ ఫిదా..

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం జల్సా. ఈ మూవీ ఫ్యాన్స్ కి ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది. పవన్ కి ఎలాంటి హిట్ లేని టైంలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ లో కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ, స్టైల్, ఫైట్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. జల్సా చిత్రాన్ని అభిమనులు ఎప్పటికి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇటీవల సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా 4కె చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించారు. స్పెషల్ షోలకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ వచ్చింది. 

ప్రత్యేక షోల ద్వారా జల్సా చిత్రం ఏకంగా రూ 1 కోటికి పైగా వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ అభిమానూలు అయిన దర్శకుడు సాయి రాజేష్, ఎస్ కె ఎన్ , సతీష్ బొట్ట, ధర్మేంద్ర జల్సా 4 కె ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. 

జల్సా చిత్ర ప్రత్యేక షోలకు వచ్చిన రూ కోటిని వీరంతా జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. కొణిదెల నాగబాబు ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనకు రూ కోటి చెక్ అందించారు. అభిమానులు చేసిన పనికి పవన్ కళ్యాణ్ సంతోషంలో ఎమోషనల్ ఆయనట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అందరిని అభినందించారు. మీరు చేసిన పని అభిమానులకు, జనసైనికులకు స్ఫూర్తి అని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?