యూవీ క్రియేషన్స్ పై ఫ్యాన్స్ ఫైర్‌.. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` టీజర్‌ డిలేపై ట్రోల్స్

Published : Apr 29, 2023, 08:20 PM IST
యూవీ క్రియేషన్స్ పై ఫ్యాన్స్ ఫైర్‌.. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` టీజర్‌ డిలేపై ట్రోల్స్

సారాంశం

యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ మరోసారి ట్రోల్స్ కి గురవుతుంది. అనుష్క నటించిన `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రం టీజర్‌ డిలే అయిన నేపథ్యంలో  ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.

డార్లింగ్ హోమ్‌ బ్యానర్‌ యూవీ క్రియేషన్స్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా వరకు ఈ బ్యానర్‌ అప్‌డేట్ల ఆలస్యం విషయంలో, నెగటివ్‌ ట్రోలింగ్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు కూడా అదే విషయంలో వార్తల్లో నిలుస్తుంది. ట్రోల్స్ కి గురవుతుంది. అభిమాలను ఆగ్రహానికి గురవుతుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి జంటగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రం రూపొందుతుంది. నూతన దర్శకుడు మహేష్‌ రూపొందిస్తున్నారు. 

సరికొత్త ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నవీన్‌ పొలిశెట్టి సినిమా కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ బోలెడు ఉంటుందని ఆడియెన్స్, ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తామని ప్రకటించింది యూనిట్‌. ఈ రోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటలకు టీజర్‌ని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్‌ చేయలేదు. తెలిపిన డేట్‌కి రెండు గంటలు దాటిపోయినా ఇంకా టీజర్‌ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

టైమ్‌ అంటే యూవీ,.. యూవీ అంటే టైమ్‌ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. తు నీ.. ఎప్పుడైనా టైమ్‌కి అప్‌డేట్‌ ఇచ్చార్రా మీరు, 6 గంటలు అంటే రివర్సా? 9 గంటలకా? అని, ఇలాంటిదేదో ఉంటుందని ముందే అనుకున్నా, ఎప్పుడైనా అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ చేశారా? అంటూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్రోల్స్, మీమ్స్ తో నానా హంగామా చేస్తున్నారు. బ్రహ్మానందం వీడియోలు పోస్ట్ చేసి వైరల్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో యూవీ క్రియేషన్స్, `మిస్‌ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి` యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇనిస్టిట్యూట్‌లో ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రదర్శించనున్నారు. దీనికోసం డిలే అవుతుందని టీమ్‌ తెలిపింది. మరి ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. ఆ వెయిటింగ్‌ని తట్టుకోలేక బూతులు ఉపయోగిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అటు నిర్మాణ సంస్థని, ఇటు నవీన్‌ పొలిశెట్టిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది