
మహానటి రిలీజై అద్భుతమైన టాక్ తో దూసుకుపోతోంది. మే 9న సెంటిమెంట్ భాగంగా తెలుగు రాష్ట్రాలు, యూఎస్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. మే 11న తమిళంలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సావిత్రికి ఇది నిజమైన నివాళి అంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా ప్రభావం దేశాలు దాటింది. న్యూయార్క్ లో సావిత్రి అభిమానులు సావిత్రి పాటలకు అక్కడ రోడ్ల పై కళ్లు చెదిరేలా నృత్యం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు వాళ్లను అభినందనలతో ముంచెత్తారు.