
NTR Jr టాలివుడ్ లో ప్రవేశించి నేటి 17 సంవత్సరాలయింది. 2000 లో ఆయన ‘నిన్ను చూడాలని’ ఎన్టీఆర్ సుడిగాలి సృష్టించారు. అంతకు ముందు 1996లోనే రామాయణలో బాలనటుడిగా కనిపించినా, ఆయన సినీజీవితం 2000 నుంచే మొదలయినట్లు చెబుతారు. అందుకే ఆయన అభిమానులు 17 సంవత్సరాల టాలివుడ్ యాత్రను ఈ రోజుసెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికోసం #17MajesticYearsOfNTR ట్విట్టర్ హ్యాండిల్ తయారు చేశారు. ఈ 17 సంవత్సరాలలోతెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేసిన @tarak9999 ను అభినందిస్తున్నారు
ఎందరో యువనటులు తెలుగు తెర మీద ప్రత్యక్ష మయి తమ ముద్ర వేసినా,అన్ని రసాలను అవలీలగాపోషించి తెలుగుప్రేక్షకుల మన్ననలను పొందింది ఎన్టీర్ మాత్రమే. ఈ విషయంలో జూనియర్ , నాటి
ఎన్టీఆర్ కి సాటి అయ్యారు. అది కేవలం 17 సంవత్సరాలలోనే సాధ్యమయిందన్నది విశేషం.