
హీరోయిన్లు ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లినా, బయట ఎక్కడైనా కనిపించినా అక్కడ జన జాతర చూడొచ్చు. కొన్నిసార్లు జనాల్ని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. తాజాగా ఇలాంటి సంఘటననే హీరోయిన్ అక్షర సింగ్ హాజరైన ఒక కార్యక్రమంలో జరిగింది. అక్షర సింగ్ భోజ్ పురి లో ఫేమస్ హీరోయిన్. ఆమె హీరోయిన్ మాత్రమే కాలేదు మంచి సింగర్ కూడా.
బీహార్ లోని ఔరంగాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అక్షర సింగ్ హాజరైంది. అయితే అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా ఆమె హాజరైంది. అయితే అప్పటికి భారీ ఎత్తున మాల్ వద్దకు అభిమానులు చేరుకున్నారు. అక్షర సింగ్ చాలా ఆలస్యంగా హాజరు కావడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు.
అక్షర సింగ్ వచ్చిన తర్వాత అభిమానుల గందరగోళం మరింత ఎక్కువైంది. తోపులాట జరిగింది. దీనితో పోలీసులు అభిమానులని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ హీరోయిన్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో ఫ్యాన్స్ లో ఆగ్రహం ఎక్కువైంది. ఈ క్రమంలో కొందరు రాళ్ల దాడికి తెగబడ్డారు.
పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అభిమానులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. అభిమానుల ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు అక్షర సింగ్ కి రక్షణ కవచంలాగా నిలబడి అక్కడి నుంచి పంపించేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.