విజయ్ కాంత్ ప్లేస్ లో విజయ్ సేతుపతి, నెక్స్ట్ కెప్టెన్ గా మక్కల్ సెల్వన్.. ?

By Mahesh JujjuriFirst Published Jan 18, 2024, 5:14 PM IST
Highlights

తమిళనాట కెప్టెన్ గా విజయ్ కాంత్ కు ఉన్న పేరు తెలిసిందే.. ఇక విజయ్ కాంత్ మరణం తరువాత ఆ స్థానం స్థాయి ఎవరికి దక్కబోతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే..? 
 

తమిళనాట విజయ్ కాంత్ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అనేది హాట్ టాపిక్ గామారింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 28న కన్ను మూశారు తమిళ స్టార్ హీరో.. కెప్టెన్ విజయ్ కాంత్. లక్షలాదిగా తరలి వచ్చిన జనసందోహం మధ్య ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. ఈక్రమంలో ఆయన కోసం లెజండరీ సెలబ్రిటీలు కంటతడిపెట్టారు. ఈక్రమంలో విజయ్ కాంత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచిపేరు గురించి తెలిసిందే. ఆయన చేసిన సమాజసేవ..ఆయనకు ఉన్న కెప్టెన్ బిరుదుకు వారసులు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. 

ఈక్రమంలో తమిళ నిర్మాత ఒకరు చేసిన కామెంట్స్ చర్చకుదారి తీశాయి. విజయ్ కాంత్ తరువాత ఆ స్థాయి లో కెప్టెన్ టైటిల్ కు ఒక్కరే అర్హులని.. ఆయనే విజయ్ సేతుపతి అని అన్నారు ప్రొడ్యూసర్ శివ. మల్టీ టాలెంట్ తో పాటు.. సమాజసేవ, సింప్లిసిటీకి విజయ్ సేతుపతి నిదర్శనం అని.. ఆయనకే కెప్టెన్ అని పిలిపించుకునేఅర్హత ఉంది అన్నట్టుగా మాట్లాడారువారు. ఇక సింగపూర్ సెలూన్ మూవీ కిసంబంధించిన వేడుకల్లో ఆయన ఈ వాఖ్యలు చేశారు. 

Latest Videos

ఆర్జే బాలాజీ హీరోగా నటిస్తున్న చిత్రం సింగపూర్ సలోన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ఆసిపట్టై బాలకుమార, జుంగా, కాష్మోరా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తరపున ఈసరి గణేష్ ఈమూవీని నిర్మిస్తున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన  ఈ సినిమాలో ఆర్జే బాలాజీ సరసన గోట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించింది. ఇందులో లాల్, రోబో శంకర్ మరియు సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించగా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతిధి పాత్రలో నటించారు. 

ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ఈరోజు చెన్నైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. అదే ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మాకల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నిర్మాత టి శివ, దర్శకుడు ఏఎల్ విజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత టి శివ మాట్లాడుతూ తమిళ సినిమాలో హీరో గ్రామర్‌ని విజయ్ సేతుపతి బ్రేక్ చేసాడు. తన సింప్లిసిటీలో ఇంత స్థాయికి  ఎదిగాడు అన్నారు. 

 

అంతే కాదు విజయ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు నటించిన సినిమా ప్రమోషన్ కోసం హీరోలను పోట్లాడుకుంటూ, కలెక్ట్ చేస్తూనే మరో సినిమా ప్రమోషన్ కోసం ఇంత బిజీ షెడ్యూల్‌లో ఇక్కడికి వచ్చినందుకు యావత్ తమిళ సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. .విజయకాంత్ గురించి ఎవరు మాట్లాడినా.. నటుడిగానే కాకుండా మంచి మనిషి అని ముందుగా చెబుతారు. ఇది చివరి వరకు కొనసాగింది. అలాగే ఇప్పుడు విజయ్ సేతుపతి అంటే మంచి మనిషి. విజయ్ సేతుపతి లుక్ మరియు క్యారెక్టర్ రెండింటిలోనూ విజయకాంత్ స్థానంలో ఉన్నాడు అన్నారు. 

తమిళ సినిమాలో అత్యధిక అతిథి పాత్రలు పోషించిన నటుడు విజయ్ సేతుపతి. ఎవరు అడిగినా నో చెప్పకుండా సహాయం చేస్తారు. అలాంటి మనస్థత్వం కలిగిని విజయ్ సేతుపతి.. తమిళ ఇండస్ట్రీకి మరో విజయ్ కాంత్ అనడంలో తప్పులేదు. కెప్టెన్ బిరుదు విజయ్ సేతుపతితే అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.

click me!