చిరును కలిసిన వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు!

By team teluguFirst Published Apr 10, 2021, 2:50 PM IST
Highlights

నేడు చిరంజీవి నివాసంలో దిల్ రాజు, శ్రీరామ్ వేణు ఆయనను కలవడం జరిగింది. వకీల్ సాబ్ విజయవంతం కావడంతో చిరంజీవి వారిని అభినందించారు. చిరంజీవి స్వయంగా నివాసానికి పిలిపించుకొని, అభినందించడంతో దిల్ రాజు, శ్రీరామ్ వేణు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

వకీల్ సాబ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మూడేళ్ళ తరువాత పవన్ నుండి వచ్చిన వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దీనితో దర్శకుడు  శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు హర్షం  వ్యక్తం చేస్తున్నారు. నిన్న పత్రికా ముఖంగా దిల్ రాజు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 


నేడు చిరంజీవి నివాసంలో దిల్ రాజు, శ్రీరామ్ వేణు ఆయనను కలవడం జరిగింది. వకీల్ సాబ్ విజయవంతం కావడంతో చిరంజీవి వారిని అభినందించారు. చిరంజీవి స్వయంగా నివాసానికి పిలిపించుకొని, అభినందించడంతో దిల్ రాజు, శ్రీరామ్ వేణు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక గత రాత్రి చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ చిత్రం చూశారు. అనంతరం మూడు సంవత్సరాల తరువాత కూడా పవన్ లో అదే వేడి, వాడి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 


అలాగే వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో భాగమైన నటులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక రోల్స్ పోషించడం జరిగింది. థమన్ మ్యూజిక్ అందించగా సినిమా విజయంలో భాగమైంది.

click me!