మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసందే. చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు.
’భీమ్లా నాయక్‘ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘రిపబ్లిక్’ తర్వాత సాయి ధరమ్ తేజ్ వెండితెరపై ఫ్యాన్స్ ను అలరించింది లేదు. దాదాగాపు ఈ చిత్రాలు విడుదలై ఏడాదిన్నర సమయం కావోస్తోంది. ఇక అభిమానులకు ఫుల్ ఖుషీ చేసేందుకు మామ అల్లుళ్లు ఓకే చిత్రంలో నటించబోతుండటం బిగ్ సర్ ప్రైజ్ గా మారింది. తమిళంలో రూపొందిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
తమిళంలో డైరెక్ట్ చేసి, నటించి హిట్ కొట్టిన తర్వాత తెలుగులోనూ దర్శకుడు, నటుడు సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నారు. గతనెల ఫిబ్రవరి 22న అధికారికంగా లాంచ్ అయి షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చిత్రం నుంచి అదిరిపోయే బజ్ వినిపిస్తోంది. ఉగాది ఎలాంటి అప్డేట్ అందకపోయినా త్వరలో సాలిడ్ అప్డేట్ వస్తుందని అంటున్నారు. అదేంటో కాదు.. చిత్రం రిలీజ్ డేట్ పైనే అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
ప్రస్తుత అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమాను మేకర్స్ జూలై 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేస్తున్నారు. డేట్ ఫిక్స్ చేసుకోవడం కాకుండా త్వరలోనే మరో అదిరిపోయే అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు తొలిసారిగా పవర్ స్టార్ తో నటించబోతున్న సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ కాబోతుందనే వార్తకు సంతోషిస్తున్నారు.
ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి రెండో అవకాశం ఇస్తాడు. అదే కాన్సెప్ట్ ను తమిళ ప్రేక్షకులకు పెద్ద హిట్ చేశారు. ఇక తెలుగులో ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్న విషయం తెలిసిందే. చిత్రానికి ‘దేవుడు’, ‘దైవం’ అనే టైటిల్స్ పెడితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, తదితరులు అలరించబోతున్నారు.
సాయి ధరమ్ తేజ్ మరోవైపు ‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటు పవన్ చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలపైనా భారీ అంచనాలు నెలకొని ఉన్నారు. అయితే హరిహర వీరమల్లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
storming in theatres from 2️⃣8️⃣th July 2023🌀
Bombarding updates on the way💥 pic.twitter.com/HpuF8i34xf