విజయ్‌ దేవరకొండ సడెన్ సర్‌ప్రైజ్‌..`ఫ్యామిలీ స్టార్‌` మ్యూజికల్‌ జర్నీ స్టార్ట్..

Published : Feb 05, 2024, 10:17 PM IST
విజయ్‌ దేవరకొండ సడెన్ సర్‌ప్రైజ్‌..`ఫ్యామిలీ స్టార్‌` మ్యూజికల్‌ జర్నీ స్టార్ట్..

సారాంశం

విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో `గీత గోవిందం` తర్వాత మరో మూవీ `ఫ్యామిలీ స్టార్‌` వస్తుంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్‌ జర్నీ ప్రారంభించింది చిత్ర బృందం. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ `ఖుషి` వంటి మ్యూజిక్‌ హిట్‌ తర్వాత ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్‌`(The Family Star) చిత్రంలో నటిస్తున్నారు. తనకు `గీతా గోవిందం` వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందించిన పరశురామ్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ఈ సమ్మర్‌ స్పెషల్‌గా అలరించబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. `ఐరనే వంచాలా ఏంటి` అంటూ విలన్లకి విజయ్‌ చూపించిన ఇన్నోసెంట్‌ యాటిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. చివరికి వైఫ్‌ దగ్గర స్ట్రక్‌ అయిపోయినట్టుగా సాగే గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. 

ఇక ఈ మూవీ నుంచి తాజాగా సడెన్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. మ్యూజికల్‌ జర్నీని ప్రారంభించబోతున్నారు. పాటలు విడుదల చేయబోతున్నారు. తాజాగా మొదటి పాటకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ మూవీ నుంచి `నంద నందాన` అంటూ సాగే మొదటి పాట ప్రోమోని విడుదల చేశారు. వినసొంపుగా సాగే మెలోడీగా ఈ సాంగ్‌ ఉంటుందని అర్థమవుతుంది. క్యూరియాసిటీని పెంచుతుంది. ఫిబ్రవరి 7న ఈ పూర్తి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. 

గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్న చిత్రమిది. ఈ మొదటి పాటని సిద్‌ శ్రీరామ్‌ ఆలపించడం విశేషం. ఆనంత శ్రీరామ్‌ ఈ పాటని రాశారు. ఈ థ్రయో మరోసారి కలిసి పనిచేయడం విశేషం. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. `గీత గోవిందం`లో `ఇంకేం ఇంకేం కావాలే` అనే పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాట కూడా హిట్‌ కావడం ఖాయమే అంటున్నారు. ఇందులో మృణాల్‌ని ఉద్దేశించి హీరో విజయ్‌ దేవరకొండ ఈ పాటని ఆలపిస్తాడని తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. 

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారు. ఈ సమ్మర్‌కి ఫ్యామిలీ ఆడియెన్స్ కి, యూత్‌కి మంచి మ్యూజికల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది `ది ఫ్యామిలీ స్టార్‌` యూనిట్‌. 

Read more: మురళీమోహన్‌ని పట్టుకుని అందాలన్నీ అందుకోరా అంటూ `జబర్దస్త్` రష్మి రచ్చ.. బాబోయ్‌ ఏంటీ అరాచకం..

Also Read: ఆ స్టెప్పులు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు.. చిరంజీవి డాన్సులపై సాయిపల్లవి కామెంట్స్ వైరల్‌..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌