'యానిమల్' ఎఫెక్ట్.. 40 నిమిషాలు సందీప్ వంగాతో ఫోన్ లో మాట్లాడిన స్టార్ హీరో

By tirumala AN  |  First Published Feb 5, 2024, 4:51 PM IST

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సందీప్ రెడ్డి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి.


సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సందీప్ రెడ్డి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి. సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యువత పండగ చేసుకున్నారు. 

రణబీర్ కపూర్ మాత్రం యాంగ్రీ అండ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యానిమల్ మూవీ మీమ్స్ కనిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Latest Videos

అయితే కొందరు తమిళ సెలెబ్రిటీలు యానిమల్ చిత్రంపై విమర్శలు చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ మాత్రం యానిమల్ చిత్రానికి ఫిదా అయ్యారు. యానిమల్ చిత్రానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ వంగా తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. 

యానిమల్ చిత్రం రిలీజ్ అయ్యాక సందీవ్ కి చాలా ప్రశంసలు దక్కి ఉంటాయి. అయితే ఒక స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు మాత్రం ప్రత్యేకం అని సందీప్ అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న రణ్వీర్ సింగ్. 

యానిమల్ చూసిన తర్వాత రణ్వీర్ సందీప్ కి ఫోన్ చేశారట. ఏకంగా 40 నిమిషాల పాటు ఈ చిత్రం గురించి మాట్లాడారట. ఫోన్ సంభాషణతో ఆగలేదు.. అనంతరం మరిన్ని విశేషాలని మెసేజ్ లో పంచుకున్నారట. ఆ మెసేజ్ ని తాను నాలుగు సార్లు చదువుకున్నానని.. చాలా సంతోషం వేసినట్లు సందీప్ తెలిపారు. 

యానిమల్ ఈ రేంజ్ హిట్ కావడంతో యానిమల్ పార్క్ పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. యానిమల్ పార్క్ తో ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేస్తానని.. రణబీర్ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతోందని సందీప్ క్లారిటీ ఇచ్చాడు. 

click me!