సీనియర్‌ నటి కవిత చనిపోయారంటూ నెట్టింట ఫేక్ న్యూస్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నటి

Published : May 03, 2022, 07:05 PM IST
సీనియర్‌ నటి కవిత చనిపోయారంటూ నెట్టింట ఫేక్ న్యూస్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నటి

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇకలేరంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. ఆ న్యూస్ అవాస్తవమని తెలిపారు. అలాగే ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తే ఊరుకోనని హెచ్చరించింది.  

టాలీవుడ్ సీనియర్ నటి కవిత వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. నిండు తెలుగుదనంతో బిగ్ స్క్రీన్ పై స్టార్స్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.  తన 11వ ఏట తమిళ చిత్రం ‘ఓ మంజు’ మరియు తెలుగు సినిమా ‘సిరి సిరి మువ్వ’ చిత్రాల్లో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 1976 నుంచి గతేడాది వరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 350కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం నటి కవిత 56 ఏండ్ల వయస్సుకు చేరకుంది. దీంతో ఆరోగ్య సమస్యల వల్ల తను చనిపోయారంటూ కొందరు సోషల్ మీడియలో ఫేక్ న్యూస్, య్యూటూబ్ లో వీడియోలు పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న నటి స్పందిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించింది. తమ బంధువులు, స్నేహితులు భయపడుతున్నారని తెలిపింది. ఇందుకు వెంటనే ఆ న్యూస్ కు సంబంధించిన పోస్ట్ లు, వీడియోలను తొలగించాలని అన్ని యూట్యూబ్ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చింది.  లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది. 

ఏపీకి చెందిన కవిత నటిగానే కాకుండా పొలిటిషన్ గానూ ప్రజా సేవ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ (BJP) మెంబర్ గా కొనసాగుతోంది. గతేడాది తన భర్త దశరథ్ రాజ్ చనిపోయారు. కోవిడ్ 19కు గురై ఆరోగ్యం క్షీణించి చనిపోయారు. అంతకు ముందే తన కొడుకు కూడా  వైరస్ బారిన పడి చనిపోయినట్టు సమాచారం. వీరికి మొత్తం ముగ్గురు సంతానం ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే