బండ్ల గణేష్ హీరోగా నటించిన ‘డేగల బాబ్జీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

Published : May 03, 2022, 06:31 PM IST
బండ్ల గణేష్ హీరోగా నటించిన ‘డేగల బాబ్జీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

సారాంశం

ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డేగల బాబ్జీ’. ఈ చిత్రం నుంచి గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ చిత్రం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.    

నటుడిగా చాలా సినిమాల్లో ప్రేక్షకులను అలరించాడు బండ్ల గణేష్ (Bandla Ganesh). అలాగే ప్రొడ్యూసర్ గానూ గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించారు. తొలిసారిగా ప్రధాన పాత్రలో విభిన్న పాత్రలో నటించి ‘డేగల బాబ్జీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బిగ్ స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ‘డేగల బాబ్జీ’. ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా.. కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. 

తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7"  చిత్రాన్ని తెలుగులో .ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రమే 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ రోజు రంజాన్ సందర్భంగా మేకర్స్ రీలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 20 న గ్రాండ్ గా ‘డేగల బాబ్జీ’ విడుదలకు షెడ్యూల్ చేసినట్టు ప్రకటించారు.    

గతేడాదే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మర్డర్ కేసులో జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’.. పలు ఆరోపణలు ఎదుర్కొని, వాటి నుంచి బయటపడటమే ప్రధాన కథాంశంగా ఉండనుంది. అలాగే ఈ చిత్రంలోని డైలాగ్స్, సోల్ ఫుల్ సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. డేగల బాబ్జీ పాత్రలో  నటించిన బండ్ల గణేష్ అన్ని ఎమోషన్స్ ను వందశాంత పండించినట్టుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి పీఆర్వోగా సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, కళా దర్శకత్వం: గాంధీ, కూర్పు: ఎస్.బి. ఉద్దవ్, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, కథ: ఆర్. పార్తిబన్, మాటలు: మరుధూరి రాజా, వైదేహి, సంగీతం: లైనస్ మధిరి, సమర్పణ: రిషి అగస్త్య, నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్ దర్శకత్వం: వెంకట్ చంద్ర వహించగా  స్వాతి చంద్ర నిర్మించారు. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి