'గీత గోవిందం' రూ.100 కోట్లు.. నిజమేనా..?

By Udayavani DhuliFirst Published Aug 28, 2018, 3:24 PM IST
Highlights

స్టార్ హీరోల సినిమా విడుదలైదంటే.. అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. రెండు రోజులకి రూ.50 కోట్ల పోస్టర్, వారం రోజులకి రూ. 100కోట్ల పోస్టర్ వేస్థుటున్నారు నిర్మాతలు. నిజంగానే సినిమా అంత కలెక్ట్ చేయకపోయినా.. మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయిస్తుంటారు

స్టార్ హీరోల సినిమా విడుదలైదంటే.. అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. రెండు రోజులకి రూ.50 కోట్ల పోస్టర్, వారం రోజులకి రూ. 100కోట్ల పోస్టర్ వేస్థుటున్నారు నిర్మాతలు. నిజంగానే సినిమా అంత కలెక్ట్ చేయకపోయినా.. మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయిస్తుంటారు. తాజాగా 'గీత గోవిందం' సినిమాకు కూడా వంద కోట్ల పోస్టర్ వేశారు. రెండు రోజుల క్రితమే కదా.. రూ.40 కోట్లు క్రాస్ చేసిందనన్నారు.. అప్పుడే వంద కోట్ల పోస్టర్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ సినిమా ఇప్పటివరకు రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రూ.100 కోట్లు మాత్రం రాలేదనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు సినిమా మహా అయితే రూ. 70 నుండి 80 కోట్ల షేర్ వసూలు చేసి ఉండొచ్చని.. వంద కోట్లకు మరికొన్ని రోజులు పడుతుందని అంటున్నారు. త్వరలోనే రాబోయే కలెక్షన్స్ తో ముందుగానే పోస్టర్ వేసి దించేసింది అల్లు అరవింద్ కాంపౌండ్.

ఇలా అత్యుత్సాహంతో పోస్టర్ వదిలి విమర్శలపాలవుతుంది గీత గోవిందం టీమ్. జెన్యూన్ హిట్ ని జెన్యూన్ గానే చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.  

ఇది కూడా చదవండి.. 

'గీత గోవిందం' అడ్వాంటేజ్ 'నోటా' తీసుకుంటుందా..?

click me!