అల్లు అర్జున్ తోనే కాదు రామ్ చ‌ర‌ణ్‌తోనూ శతృత్వం

Surya Prakash   | Asianet News
Published : Aug 19, 2021, 06:56 AM IST
అల్లు అర్జున్ తోనే కాదు రామ్ చ‌ర‌ణ్‌తోనూ శతృత్వం

సారాంశం

ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.

రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.ఈ తాజా సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో విలన్ గా...ఫహద్ ఫాజిల్ నటించబోతున్నారు. అదిచాలా పవర్ ఫుల్ పాత్ర అని, హీరోతో దాదాపు సమానంగా పోటీ పడే క్యారక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ  స్టోరీ లైన్, క్యారక్టర్ గురించి ఫహద్ ని కలిసి ఆయన పాత్ర గురించి వివరించారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ త్వరలో ప్రారంభమౌతుందని, సినిమాలో ఫహద్ కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని తమిళ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ ..పుష్ప సినిమాలో విలన్ గా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా విలక్షణంగా ఉండబోతోంది.   'పుష్ప' సినిమాలో ప్రధాన విలన్ పాత్రను పోషిస్తూ, టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. మరోపక్క తమిళంలో కమలహాసన్ నటిస్తున్న 'విక్రమ్' సినిమాలో కూడా విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగులో రామ్ చరణ్ తో చేసే  భారీ చిత్రంలో నటించే అవకాశం  ఫహద్ కు వచ్చినట్టు తెలుస్తోంది.  మంచి ఆఫర్ కావడంతో ఈ సినిమా చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపుతున్నట్టు చెబుతున్నారు. అలా తెలుగులో తన తొలి సినిమా 'పుష్ప' విడుదల కాకుండానే మరో సినిమాలో నటించే ఛాన్సును ఫహద్ అందుకున్నాడన్న మాట! అయితే ఇంకా ఫహద్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయ్యితే రాలేదు. అఫీషియల్ గా ప్రకటనా లేదు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు చెప్పుతున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల రూమర్స్ వినపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం రామ్ చరణ్ సరసన నటించే భామను ప్రకటించారు. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుందని ప్రకటించింది. కియారా అద్వానీ గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి తన అందచందాలతో అదరగొట్టింది.  ప్రస్తుతం చరణ్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే శంకర్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు శంకర్‌ ‘భారతీయుడు2’ ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వీలైనంత త్వరగా చరణ్‌ సినిమాను మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Top 10 Heroes: విజయ్‌, ఎన్టీఆర్‌, అల్లు, చరణ్‌ డౌన్‌.. ధురంధర్‌ 2 హీరో జోరు.. నెం 1 ఎవరంటే?