F3:'ఎఫ్ 3' సెకండ్ డే కలెక్షన్స్...డ్రాప్ ఉందా?

Surya Prakash   | Asianet News
Published : May 29, 2022, 12:48 PM IST
F3:'ఎఫ్ 3' సెకండ్  డే కలెక్షన్స్...డ్రాప్ ఉందా?

సారాంశం

గత శుక్రవారం (మే 27) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్  వచ్చింది. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటనపై పాజిటివ్ టాక్ వినిపించింది. మరి ఈ రెండు రోజుల్లో F3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సమ్మర్ సోగ్గాళ్ళ హవా ఏ మేర అందిస్తోంది


వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందిన చిత్రం భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ హీరోయిన్స్ గా అందాల సందడి చేసే ఈ సినిమాను,  మొన్న అంటే ఈ నెల 27వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసారు. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  పెద్ద సినిమా.. పైగా మ‌ల్టీస్టార‌ర్‌... దానికి తోడు హిట్ ఫ్రాంచైజీ కావటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. 

 ఈ నేఫధ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ డే కలెక్షన్స్ 10.37కోట్లు వసూలు చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనెర్ కావటం తో హాట్ టాపిక్ గా మారింది. దాంతో రెండో రోజు శని వారం కూడా సినిమా 8.4 కోట్లు  కలెక్ట్ చేసింది. రెండు రోజులకు కలిపి  18.77 కోట్లు వసూలు చేసింది. సాధారణంగా రెండో రోజుకు ముప్పై నుంచి నలబై శాతం దాకా డ్రాప్ ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఈ సమస్య ఎదురుకాలేదు. కేవలం పది శాతం మాత్రమే డ్రాప్ కనపడిందని ట్రేడ్ అంటోంది.
  
 
నైజాం –  Rs 8.16 కోట్లు

సీడెడ్ – Rs 2.41 కోట్లు

ఉత్తరాంధ్ర – Rs 2.23 కోట్లు

ఈస్ట్ గోదావరి – Rs  1.28  కోట్లు

వెస్ట్ గోదావరి – Rs 1.23  కోట్లు

గుంటూరు – Rs 1.42   కోట్లు

కృష్ణా – Rs  1.18   కోట్లు

నెల్లూరు – Rs 0.86  కోట్లు

ఆంధ్రా, తెలంగాణా షేర్:  Rs  18.77 కోట్లు  
 
ఇక    `సాధార‌ణ టికెట్ రేట్ల‌కే సినిమా` అంటూ మిడిల్ క్లాస్ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌వైపు ర‌ప్పించ‌డానికి దిల్ రాజు ఆల్రెడీ ప్రకటన చేసారు.అదే కలిసొచ్చిందంటున్నారు. ఈ సినిమా మౌత్ టాక్ ని బ‌ట్టి... రెస్పాన్స్‌ని బ‌ట్టి, ప్రేక్ష‌కుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యిందని సమాచారం.  ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్ష‌కులే ఈ సినిమాకి బ‌లం. వాళ్లు మౌత్ టాక్ ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. శ‌ని, ఆదివారాల నుంచి... థియేట‌ర్లు నిండుతాయి`` అని లెక్కలు వేస్తున్నారు.

ఇక ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' ఐటమ్ సాంగ్ లో పూజ మెరిసింది. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆమె అంగీకరించింది. 'ఎఫ్ 3' సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె సందడి చేయటం కలిసి వస్తుందని అంటున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?