F3:'ఎఫ్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్...ఏరియావైజ్ లెక్కలు

Surya Prakash   | Asianet News
Published : May 28, 2022, 01:28 PM IST
F3:'ఎఫ్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్...ఏరియావైజ్ లెక్కలు

సారాంశం

 ఈ సినిమా మౌత్ టాక్ ని బ‌ట్టి... రెస్పాన్స్‌ని బ‌ట్టి, ప్రేక్ష‌కుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యిందని సమాచారం.  ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్ష‌కులే ఈ సినిమాకి బ‌లం. వాళ్లు మౌత్ టాక్ ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. 


వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ హీరోయిన్స్ గా అందాల సందడి చేసే ఈ సినిమాను,   నిన్న అంటే ఈ నెల 27వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసారు. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  పెద్ద సినిమా.. పైగా మ‌ల్టీస్టార‌ర్‌... దానికి తోడు హిట్ ఫ్రాంచైజీ కావటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది.  ఈ నేఫధ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.. 
 
నైజాం –  Rs 4.06కోట్లు

సీడెడ్ – Rs 1.26కోట్లు

ఉత్తరాంధ్ర – Rs 1.18కోట్లు

ఈస్ట్ గోదావరి – Rs 76 లక్షలు

వెస్ట్ గోదావరి – Rs 94 లక్షలు

గుంటూరు – Rs 88 లక్షలు

కృష్ణా – Rs 66 లక్షలు

నెల్లూరు – Rs 61 లక్షలు

ఆంధ్రా, తెలంగాణా షేర్:  Rs 10.35కోట్లు ( Rs 17కోట్లు  గ్రాస్)

కర్ణాటక+భారత్ లో మిగతా భాగాలు: Rs 0.85కోట్లు

ఓవర్ సీస్ : Rs 2.15కోట్లు

వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్స్  : Rs 13.35కోట్లు ( Rs 23కోట్లు గ్రాస్)
 

ఇక    `సాధార‌ణ టికెట్ రేట్ల‌కే సినిమా` అంటూ మిడిల్ క్లాస్ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌వైపు ర‌ప్పించ‌డానికి దిల్ రాజు ఆల్రెడీ ప్రకటన చేసారు.అదే కలిసొచ్చిందంటున్నారు. ఈ సినిమా మౌత్ టాక్ ని బ‌ట్టి... రెస్పాన్స్‌ని బ‌ట్టి, ప్రేక్ష‌కుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యిందని సమాచారం.  ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్ష‌కులే ఈ సినిమాకి బ‌లం. వాళ్లు మౌత్ టాక్ ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. శ‌ని, ఆదివారాల నుంచి... థియేట‌ర్లు నిండుతాయి`` అని లెక్కలు వేస్తున్నారు.

ఇక ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' ఐటమ్ సాంగ్ లో పూజ మెరిసింది. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆమె అంగీకరించింది. 'ఎఫ్ 3' సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె సందడి చేయటం కలిసి వస్తుందని అంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?