
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవరనాగవంశీ నిర్మించిన `డీజే టిల్లు` చిత్రం శనివారం(ఫిబ్రవరి 12) న విడుదలైంది. హిలేరియస్ కామెడీగా సాగే ఈ చిత్రానికి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వస్తుంది. దీంతో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది యూనిట్. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `డీజే టిల్లు` సీక్వెల్ ఉంటుందని తెలిపారు. క్యారెక్టర్ బేస్డ్ కథలతో ఎన్ని సినిమాలైనా చేయోచ్చని, డీజే టిల్లు పాత్ర జనాలకు ఎక్కేసిందని, దీంతో వరుసగా సినిమాలు చేస్తామని తెలిపారు. అయితే సీక్వెల్ మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందన్నారు.
డీజే టిల్లుకి వస్తున్న రెస్పాన్స్ పై ఆయన రియాక్ట్ అవుతూ, 2020 మార్చిలో కథ విన్నప్పుడే సినిమా ఇలా ఉంటుంది, ఈ రకమైన రెస్పాన్స్ వస్తుందని ముందే తెలుసు. అదే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు కొడితేనే ధైర్యం పెరుగుతుంది. చిన్న సినిమాలు కొడితేనే ఆ కిక్కు వేరు. సినిమాకి సంబంధించి ముందే ప్లానింగ్ ఏం లేదు. మా బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియెన్స్ నమ్మాలి. మంచి సినిమా వస్తుందనే నమ్మకం వారిలో ఉంది. దాన్ని మేం ఎప్పుడూ పోగొట్టుకోం. ఎంటర్‌టైనింగ్ చిత్రాలను అందించడమే సితార, హారిక అండ్ హాసిన బ్యానర్ల టార్గెట్. సినిమా కథ గురించి బాబాయ్(ఎస్.రాధాకృష్ణ)కి చెప్పినప్పుడే సినిమా ఆడుతుందని, సినిమా చూశాక అదే ఫీలింగ్‌ని వెల్లడించారు. నేనే కాస్త టెన్షన్ పడ్డా కూడా, ఆయన రిలాక్స్ గా ఉన్నారు, నన్ను టెన్షన్ పడొద్దని చెప్పారు. డిజె టిల్లు సీక్వెల్ సినిమానే సిద్ధు నెక్ట్ పిక్చర్ గా చేస్తున్నాం` అని తెలిపారు నాగవంశీ.
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, సినిమాకి వస్తోన్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాము కామెడీ టెన్ టైమ్స్ పేలుతాయనుకుంటే, అవి థియేటర్లో థౌజండ్ టైమ్స్ పేలాయని తెలిపారు. తాను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అవే సినిమాలో రాశాను. సొంతంగా డైలాగ్ లు రాసుకోవడం వల్ల హెల్ప్ అయ్యింది. ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఎప్పుడూ పొందలేదు. ఈ రోజు వచ్చింది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. దర్శకుడు త్రివిక్రమ్ దొరకడం మాకు అదృష్టం. ఆయన ఏవేవి బాగుంటాయో, అవే థియేటర్లో పేలాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన మాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ విషయంలో నాగవంశీ, చిన్నబాబులకు థ్యాంక్స్. హీరోయిన్ నేహా శెట్టికి కూడా ధన్యవాదాలు` అని తెలిపారు.
దర్శకుడు విమల్ కృష్ణ చెబుతూ, ఫస్ట్ టైమ్ థియేటర్ ఎక్స్ పీరియెన్స్ చాలా సంతోషంగా ఉందన్నారు. `ఇవాళ థియేటర్ లకు వెళ్తి అక్కడ ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డిజె టిల్లు కు మేము ఇంత క్రేజ్ సృష్టించామా అనిపించింది. సినిమాలో సంభాషణలకు వస్తున్న స్పందన,ఈ క్రెడిట్ అంతా నేను సిద్ధుకు ఇస్తాను. నిర్మాత నాగవంశీ గారి నమ్మకం, మా కష్టం అంతా ఇవాళ ఈ విజయానికి కారణం అంటూ ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను` అని చెప్పారు దర్శకుడు.