ఒకేరోజు ఇటు థియేటర్లలో `లవ్‌స్టోరి`, అటు ఓటీటీలో `టక్ జగదీష్‌`.. ఎగ్జిబిటర్లు ఆగ్రహం..

Published : Aug 20, 2021, 10:50 AM IST
ఒకేరోజు ఇటు థియేటర్లలో `లవ్‌స్టోరి`, అటు ఓటీటీలో `టక్ జగదీష్‌`.. ఎగ్జిబిటర్లు ఆగ్రహం..

సారాంశం

`టక్‌ జగదీష్‌` చిత్రాన్ని సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. అదే రోజు నాగచైతన్య, సాయిపల్లవి నటించిన `లవ్ స్టోరి` చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని, థియేటర్‌ కోసం ఓ సినిమా, ఓటీటీ కోసం మరో సినిమా పోటీ పడటంతో థియేటర్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాపై ప్రభావం పడుతుందని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. 

థియేటర్లు ఓపెన్‌ అయినా పెద్ద సినిమాలు రిలీజ్‌కి ముందుకు రావడం లేదు. డేట్‌ వెనక్కి వెల్లడమో, లేక ఓటీటీలనో ఆశ్రయిస్తున్నారు. ఇటీవల వెంకటేష్‌ నటించిన `నారప్ప` సినిమా ఓటీటీలో విడుదలపై పెద్ద వివాదమే నడిచింది. అది తమిళ నిర్మాత కలై పులి ఎస్‌ థాను నిర్ణయమని టాలీవుడ్ నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనపై వచ్చిన విమర్శలు అటువైపు మళ్లీంచారు. ఇప్పుడు మరోసారి ఓటీటీ వివాదం నెలకొంది. 

నాని హీరోగా రూపొందిన `టక్‌ జగదీష్‌` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్‌ 10న దీన్ని ప్రముఖ ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల హీరో నాని వెల్లడించారు. నిర్మాతల ఒత్తిడి మేరకు, థియేటర్లలో పరిస్థితి, ఏపీలో థియేటర్లలో 100శాతం సీటింగ్‌కి అనుమతి లేకపోవడం వంటి కారణాలతో సినిమాని ఎలా విడుదల చేయాలనే దానిపై నిర్మాతల నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్టు నాని తెలిపారు. 

అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. అదే రోజు నాగచైతన్య, సాయిపల్లవి నటించిన `లవ్ స్టోరి` చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని, థియేటర్‌ కోసం ఓ సినిమా, ఓటీటీ కోసం మరో సినిమా పోటీ పడటంతో థియేటర్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాపై ప్రభావం పడుతుందని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. 

అదే సమయంలో `టక్ జగదీష్` సెప్టెంబర్ 10న విడుదల పై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లకి మద్దతు ఇవ్వకుండా ఓటీటీ విడుదలపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు సమావేశం కానున్నారు. థియేటర్లలో విడుదలవుతున్న `లవ్ స్టోరీ`కి అదే రోజు విడుదలవుతున్న `టక్ జగదీష్` వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చునని థియేటర్ యజమానుల అసంతృప్తి చెందుతున్నారు. దీంతో ఇది టాలీవుడ్‌లో మరో వివాదానికి తెరలేపినట్టయ్యింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా