
ప్రస్తుతం పిల్మ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది మంచు, భూమా వారి పెళ్ళి హడావిడి. మంచు మోహన్ బాబు చిన్నబ్బాయి మనోజ్.. భూమా వారి చిన్నమ్మాయి మౌనిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసిందే అయినా.. ఈ మధ్యనే ఎవరికి సరిగా తెలియని మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు వీరి విషయం భయటపడింది మొన్ననే అయినా.. బంధం మాత్రం ఈనాటిది కాదని తెలుస్తోంది. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ కన్ ఫార్మ్ చేశారు.
రీసెంట్ గా సీతాఫల్‌మండిలోని ఓ గణేష్ మండపాన్ని ఇద్దరూ జంటగా దర్శించుకున్నారు. కలిసి పూజలు చేశారు. ఇక అప్పటినుంచి స్టార్ట్ అయ్యింది రచ్చ. ఆరోజు నుంచి వీరిద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నరంటూ వార్తలు రావటం మొదలైంది. ఈ మధ్యలో మోహన్ బాబు సడెన్ గా చంద్రబాబును కలవడం... ఆతరువాత వీరి విషయం బయటకు రావడంతో.. సర్వత్ర కొత్త చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరి బంధంపై ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ప్రకాశ్ రావ్ మాట్లాడుతూ.. అసలు ఇప్పుడు వారి పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు కాని.. వాళ్ల రెండు కుటుంబాలకు మొదటినుంచి సంబంధం ఉంది. మౌనికకు మంచు ఫ్యామిలీతో మంచి సంబంధం ఉంది అన్నారు. మనోజ్‌తో ఆమెకు మొదటి నుంచి మంచి స్నేహం ఉందని.. అది ప్రేమగా మారి.. ఒక స్టేజిలో పెళ్లి వరకు పోయారని గోనే అన్నారు. అంతే కాదు భూమా నాగిరెడ్డి, శోభానాగి రెడ్డి దాన్ని వ్యతిరేకించడంతో అప్పుడు అది అక్కడితో ఆగిపోయిందన్నారు. ఎవరికి వారు విడిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారని. ఆతరువాత మళ్ళీ వారికి రూట్ క్లియర్ అయ్యిందన్నారు.
భూమా మౌనిక ఒక కుమారుడు పుట్టిన తరువాత డైవర్స్ తీసుకోండం. మనోజ్ కు కూడా డైవర్స్ అవ్వడం తో ఇద్దరు మళ్ళీ కలిసిపోయారని అన్నారు. అంతే కాదు ఇద్దరు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు మీడియాలో రావచ్చు. రెండు కుటుంబాలకు.. రాయలసీమలో లక్షల మందికి.. హైదరాబాద్ లో చాలా మంది సినిమావాళ్లకు తెలిసిన నిజమే ఇది అంటూ గోనే వ్యాఖ్యానించారు. అంతే కాదు వీరిద్దరు ఎప్పటి నుంచో.. మద్రాస్‌లో కలిసున్నారని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇక హీరో మంచు మనోజ్ తల్లిదండ్రులను ఒప్పించడం..పెళ్లి గురించి క్లారిటీ తీసుకోవడంతో, అఫియల్‌గా మంచి రోజులు చూసుకుని పెళ్లి చేయాలని వారు భావిస్తున్నట్టు చెప్పారు. ఇలా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రశాశ్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని... త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.