
టాలీవుడ్ స్టార్ హీరో రానా తిరుమల తిరుపతిలో సందడి చేశారు. తన ఫ్యామిలీ అంతటితో కలిసి కొండ మీదకు వచ్చిన రానా శ్రీవారిని స్పెషల్ గా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరో రానా, తన భార్య మిహీకా బజాజ్ తో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రానా , మిహికాతో పాటు ఆయన రానా తండ్రి.. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, రానా తమ్ముడు.. అప్ కమింగ్ హీరో అభిరామ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వీరు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయ ఉద్యోగులు వీరిని శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందించారు.
రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. తేజా డైరెక్షన్ లో అభిరామ్ హీరోగా అహింసా టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి.. త్వరలోనే ఈమూవీని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో కుటుంబం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు ఇతర మొక్కులు కూడా చెల్లించేందుకు ప్యామిలీ అంతా తిరుమలకు వచ్చారు.
ఇక రానా, మిహీకాలతో పాటు ఫ్యామిలీ అంతా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ముఖ్యంగా సురేశ్ బాబు, అభిరామ్ మాల ధరించి కనిపించారు. దర్శనానంతరం ఫోటో గ్రాఫర్లకు స్టిల్స్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించారు. అటు వీరిని చూడగానే అభిమానులు ఒక్క సారిగా మీదకు వచ్చారు. . మరోవైపు వీరిని చూడగానే అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ఒక అభిమాని ప్రయత్నించగా... అతడి ఫోన్ ను రానా లాగేశాడు. గుడి దగ్గర సెల్ఫీలు వద్దని అన్నాడు. దర్శనం తరువాత పలకరిస్తున్న అభిమానుల మీద ఒకింత అసహనం చూపించాడు రానా. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.