నటిని పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటికి వెళ్లి..!

Published : May 10, 2019, 09:42 AM IST
నటిని పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటికి వెళ్లి..!

సారాంశం

తమిళంలో పాపులర్ టీవీ సీరియల్ 'రాజారాణి'లో నటిస్తోన్న రితికాను పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ గొడవకి దిగాడు. 

తమిళంలో పాపులర్ టీవీ సీరియల్ 'రాజారాణి'లో నటిస్తోన్న రితికాను పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ గొడవకి దిగాడు. వివరాల్లోకి వెళితే.. రితికా తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

డబ్ స్మాష్, టిక్ టాక్ యాప్ లలో తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూ మరింత ఫేమస్ అయింది. ఈమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి చెన్నైలోని వడపళని సమీపంలో ఓ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నారు. గురువారం నాడు ఓ యువకుడు రితికా ఉండే అపార్ట్ మెంట్ ఇంటి తలుపు తట్టగా ఆమె తండ్రి సుబ్రహ్మణి తెరిచారు. ఇంటి లోపలకి వచ్చిన ఆ యువకుడు రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రిని కోరారు.

అది విని షాక్ అయిన సుబ్రహ్మణి ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడడంతో పక్క అపార్ట్మెంట్స్ లో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని ఆ యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడిని గోబిచెట్టిపాళ్యానికి చెందిన భరత్ గా గుర్తించారు.

ఇంజనీరింగ్ చదివిన భరత్ ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని, గురువారం సొంతూరు వెళ్లడానికి అన్నీ సిద్ధం చేసుకొని రితికా ఇంటికి వచ్చి గొడవ చేశాడని పోలీసులు తెలిపారు. తనకు రితికా అంటే ఇష్టమని, ఆమెని పెళ్లి చేసుకుంటానని విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్