మెగాస్టార్ - కొరటాల.. ఆగస్ట్ కోసం వెయిటింగ్!

Published : May 10, 2019, 08:42 AM ISTUpdated : May 10, 2019, 08:45 AM IST
మెగాస్టార్ - కొరటాల.. ఆగస్ట్ కోసం వెయిటింగ్!

సారాంశం

మంచి సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో దర్శకుడు శివ పూర్తి స్క్రిప్ట్ ను కొన్ని రోజుల క్రితమే ఫినిష్ చేశాడు. అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. కాని సైరా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమా మరికొన్ని నెలల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను కొరటాల డైరెక్షన్ లో చేయబోతున్నాడు. 

మంచి సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో దర్శకుడు శివ పూర్తి స్క్రిప్ట్ ను కొన్ని రోజుల క్రితమే ఫినిష్ చేశాడు. అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. కాని సైరా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా షూటింగ్ ను ఆగస్ట్ లో మొదలెట్టడానికి కొరటాల సిద్దమవుతున్నట్లు సమాచారం. 

ఇక సినిమాకు సంబందించిన టైటిల్ ను కూడా ముందే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సైరా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మెగాస్టార్ కూడా కొరటాలతో వర్క్ చేయాలనీ అనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో సునీల్ - జబర్దస్త్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.   

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ