గెట్ రెడీ బాయ్స్.. రీ రిలీజ్ కాబోతున్న ఈనగరానికి ఏమైంది మూవీ..

Published : Jun 14, 2023, 07:24 PM IST
గెట్ రెడీ బాయ్స్.. రీ రిలీజ్  కాబోతున్న ఈనగరానికి ఏమైంది మూవీ..

సారాంశం

ఈమధ్య రీరిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీరిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలే కాదు.. పాపులర్ అయిన యంగ్ స్టార్స్ సినిమాలు కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

మెగాస్టార్ నుంచి నేచురల్ స్టార్ వరకూ..చిన్న పెద్దా స్టార్ హీరోల ఎవర్ గ్రీన్ సినిమాలు రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు మేకర్స్.  ఈక్రమంలోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్, కాకమను, అనీష, సిమ్రాన్ చౌదరి లు ప్రధాన పాత్రల్లో నటించిన  సినిమా ఈ నగరానికి ఏమైంది. ఈసినిమా రీరిలీజ్ కు  రెడీ అవుతోంది. 

 జూన్ 29, 2018 లో రిలీజ్ అయిన ఈమూవీ.. సైలెంట్ గా వచ్చి.. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్ అయ్యింది కూడా. అంతే కాదు కాలేజీ స్టూడెంట్స్ కు  ఈ సినిమాబాగా కనెక్ట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

ఇక ఈనగరానికి ఏమైంది మూవీ ఈనెల 29 న  మళ్ళీ థియేటర్ల లో విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్  పై సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం రీ రిలీజ్ కోసం ముఖ్యంగా యూత్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా