ప్రముఖ గాయని శారద రాజన్ మృతి..ఆమె పాట పాడిన ఏకైక తెలుగు చిత్రం అదే

Published : Jun 14, 2023, 07:17 PM IST
ప్రముఖ గాయని శారద రాజన్ మృతి..ఆమె పాట పాడిన ఏకైక తెలుగు చిత్రం అదే

సారాంశం

సీనియర్ గాయని శారద రాజన్ (86) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. 

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వరుస విషాదాలు సినీ అభిమానులని, ప్రముఖుల్ని కలవరపెడుతున్నాయి. గత కొంత కాలంగా ప్రతి సందర్భంలో విషాద వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ గాయని శారద రాజన్ (86) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. 

పరిస్థితి విషమించడంతో ఆమె నేడు మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. బాలీవుడ్ కి చెందిన శారద రాజన్ 1965 నుంచి సినిమాల్లో గాయనిగా పాటలు పడుతున్నారు. అనేక హిందీ చిత్రాలకు తన స్వరాన్ని అందించారు. ముఖ్యంగా చిన్న పిల్లల నేపథ్యంలో వచ్చే పాటలకు.. తన గళాన్ని చిన్న పిల్లల తరహాలో సవరించుకుని పాడడంలో ఆమె సిద్దహస్తురాలు. 

శారద రాజన్ పూర్తి పేరు శారద రాజన్ అయ్యంగార్. స్వతహాగా ఆమె తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రముఖ నటి రాజశ్రీ కోసం శారద ఎక్కువగా పాటలు పాడేవారు. లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ శారద రాజన్ ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన తన మ్యూజిక్ డైరెక్టర్స్ కి శారదని పరిచయం చేయడంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి. శారద రాజన్ గుమ్నామ్, గరీబీ హటావో, స్వప్నో కా సౌదాగర్, జహాన్ ప్యార్ మిలే లాంటి చిత్రాలకు ఆమె తన గాత్రాన్నీ అందించారు. 

జహాన్ ప్యార్ మిలే చిత్రంలో పాటలకి గాను ఆమెకి ఉత్తమ గాయనిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఇక శారద రాజన్ తన గాత్రాన్ని అందించిన ఏకైక తెలుగు చిత్రం జీవిత చక్రం. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో శారదా రాజన్.. కంటి చూపు చెబుతోంది, మధురాతి మధురం అనే సాంగ్స్ పాడారు. 

శారదా రాజన్ మరణించడం తో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, సినీ అభిమానులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్