
టాలీవుడ్ లో స్టార్ కపుల్.. క్యూట్ కపుల్.. మెగా కపుల్ అనగానే ..రామ్ చరణ్, ఉపాసనలు గుర్తుకు వస్తారు.ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... అభిమానులను అలరిస్తూ ఉంటారు. తమ తమ వర్క్స్ విషయంలో బిజీగా ఉంటూనే.. అప్పుడప్పుడు తమ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సంతోషపెడుతుంటారు. రొమాంటిక్ టూర్లు, ఫ్యామిలీ అకేషన్లు, ఇలా రకరకాల విషయాలను తమ సోషల్ మీడియా పేజ్ లలో పంచుకుంటూ.. హడావిడి చేస్తుంటారు. అంతే కాదు ఎంత హడావిడిచేసినా.. అంతే డీసెంట్ గా కూడా ఉంటారు ఈ కపుల్.
ఇక తాజాగా ఈ కపుల్.. కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలుతెలిపారు... ఈరోజు(14 జూన్) రామ్ చరణ్, ఉపాసన పెళ్ళి రోజు కావడంతో.. చిరంజీవి ప్రత్యేకంగా విష్ చేశారు. ఈమెగా కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యి.. 11 ఏళ్లు అవుతుంది. 2012 జూన్ 14న వీరు పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఉపాసన తల్లి కాబోతున్నట్టు ప్రకటించడంతో ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
Hi Charan and Upsy !
On this special day, we wish you both a happy wedding anniversary,
You both have made us proud and happy beyond measure 🤗🤗
As you step into the journey of parenthood, we wish you all the best,
May your love for your child be a story that others will love… pic.twitter.com/1bSPrRv3UO
ఇక ఈరోజు ఈ స్టార్ కపూల్ పెళ్లి రోజు కావడంతో.. మెగా కాగా మెగా అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ స్టార్ కపూల్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు కోడలికి శుభాకాంక్షలు చెప్తూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారుఉపాసన – చరణ్ ల ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవి తన ట్విట్టర్ లో.. హాయ్ చరణ్ & ఉప్సి.. ఈ స్పెషల్ రోజున మీ ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఇద్దరూ మమ్మల్ని మేము అనుకోనంతగా గర్వపడేలా చేశారు.
త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. మీ ప్రేమ గురించి మీ పిల్లలకు కథలుగా చెప్పాలి ప్రేమతో ఆశీర్వాదాలు అందిస్తున్నాం.. మీ అమ్మా, నాన్న అంటూ రాశారు. దీంతో చిరంజీవి చేసిన ఈ స్పెషల్ ట్వీట్ వైరల్ గా మారింది. ఈట్వీట్ కుబోలెడ్ లైక్ లు... కామెంట్లు.. హాట్ట్ సింబల్స్ తో పాటు.. ఈ పోస్ట్ ను శేర్ చేస్తూ.. స్పెషల్ గా వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. 11 వ పెళ్లి రోజు సందర్భంగా రాంచరణ్ తన భార్య ఉపాసనకు ప్రేమగా ముద్దు పెడుతున్న బ్యూటిఫుల్ పిక్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కూడా వైరల్ గా మారింది.