`ఈగల్‌` మూడు రోజుల కలెక్షన్లు.. ఎంత వచ్చాయి? బ్రేక్‌ ఈవెన్‌కి ఇంకా ఎంత రావాలంటే?

By Aithagoni Raju  |  First Published Feb 12, 2024, 4:42 PM IST

రవితేజ హీరోగా నటించిన `ఈగల్‌` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. మిశ్రమ స్పందనతోనూ కలెక్షన్ల విషయంలో జోరు సాగిస్తుంది. తాజాగా తొలి వీకెండ్‌లో ఎంత వచ్చాయంటే..


మాస్‌ మహారాజ రవితేజ నటించిన `ఈగల్‌`మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. విమర్శలు, ప్రశంసలు, వివాదాల మధ్య సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. మొదటి వీకెండ్‌ ముగిసే సరికి ఈ మూవీ బెటర్‌ కలెక్షన్లనే రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లో ఈ సినిమా ముప్పై కోట్లు వసూళు చేసింది. ప్రతి రోజు యావరేజ్‌గా పది కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. 

ఇక మూడు రోజు ఈ సినిమా తొమ్మిది కోట్ల 28 లక్షల గ్రాస్‌ సాధించింది. 4.88కోట్ల షేర్‌ సాధించింది. ఈ లెక్కన ఈ మూడు రోజుల్లో 30కోట్ల గ్రాస్‌, 15.91కోట్ల షేర్‌ వచ్చింది. సినిమా మొదటి వీకెండ్‌కి మంచి కలెక్షన్లని రాబట్టింది. సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరలో ఉంది. సోమవారం నుంచి వచ్చే స్పందన బట్టి ఈ మూవీ హిట్టా, ఫట్టా అనేది తేలనుంది. 

Latest Videos

ఇక ఈ సినిమా సుమారు 22కోట్ల బిజినెస్‌ జరిగిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. ఈ లెక్కన 23కోట్లు వస్తే బ్రేక్‌ ఇవెన్‌ అవుతుంది. ప్రస్తుతం వసూళ్లని బట్టి చూస్తే ఇంకా 8 కోట్లు వస్తే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. బయ్యర్లు సేఫ్‌ అవుతారు. ఈ వీకెండ్‌ వరకు ఈ సినిమా దాన్ని రీచ్‌ అవుతుందా అనేది చూడాలి. 

ఇక రవితేజ నటించిన గత చిత్రాలు `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు` సినిమాలు ఆడకపోవడంతో ఈ మూవీపై పెద్దగా బజ్‌ లేదు. రవితేజ వంటి స్టార్‌ హీరో సినిమా వస్తుందనే బజ్‌ కూడా లేదు. దీంతో మొదటి ఆటకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ యాక్షన్ సీన్లు అదిరిపోవడంతో ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. యాక్షన్‌ నచ్చినవాళ్లు సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు. 

`ఈగల్‌` కథ విషయానికి వస్తే.. విదేశాల్లో కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేస్తుంటాడు రవితేజ. అక్కడ హీరోయిన్‌ కావ్య థాపర్‌ని చూసి ఫిదా అవుతాడు. ఆమె ప్రమాదంలో ఉందని తెలిసి కాపాడతాడు. అలా రెండు మూడు సార్లు కాపాడటంతో తను షాడోలా తన వెంటే ఉన్నాడని నమ్ముతుంది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకుంటారు. కానీ టెర్రరిస్ట్ ల దాడిలో ఆమె చనిపోతుంది. దీంతో ఆయుధాలు తప్పు దారిలో వెళితే ఎలాంటి నష్టాలుంటాయనేది తెలుసుకున్న రవితేజ.. మారిపోయి ఇండియాలోని ఓ హిల్‌ స్టేషన్‌లో కాటన్‌ పరిశ్రమ నడిపిస్తుంటాడు. మరోవైపు అక్రమంగా వెళ్లే ఆయుధాలను కొట్టేస్తూ తన వద్ద సేవ్‌ చేస్తుంటాడు. ఈ విషయం తెలిసి భారత ఆర్మీ అతని కోటపై దాడి చేస్తారు. దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడనేది రెండో పార్ట్ కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీకి కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించడం విశేషం. 

Read more: `రజాకార్‌` ట్రైలర్‌.. ఏం చూపించారు.. ఎలా ఉంది?.. వివాదం ఏంటంటే? 

Also Read: మెగాస్టార్ విశ్వంభర కోసం భారీ సెట్లు.. ఎక్కడ వేస్తున్నారంటే..?
 

click me!