ప్రియాంక-నిక్ ల ప్రేమకు నేనే కారణం: డ్వెయిన్ జాన్సన్

Published : Jul 10, 2018, 01:02 PM IST
ప్రియాంక-నిక్ ల ప్రేమకు నేనే కారణం: డ్వెయిన్ జాన్సన్

సారాంశం

'ప్రియాంక. నిక్ ల ప్రేమకు కారణం నేనే.. వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ క్రెడిట్ మొత్తం నాదే. ప్రియాంక చోప్రాతో కలిసి 'బేవాచ్' సినిమాలో నటించాను. అలానే నిక్ తో కలిసి 'జుమాంజి' సినిమాలో నటించాను.

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్, నటుడు అయిన నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రియాంక.. నిక్ ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లికి కూడా పరిచయం చేసింది.

వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వారి ప్రేమకు కారణం నేనే అంటూ చెబుతున్నాడు హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్. ''ప్రియాంక. నిక్ ల ప్రేమకు కారణం నేనే.. వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ క్రెడిట్ మొత్తం నాదే. ప్రియాంక చోప్రాతో కలిసి 'బేవాచ్' సినిమాలో నటించాను. అలానే నిక్ తో కలిసి 'జుమాంజి' సినిమాలో నటించాను.

వారిద్దరికీ పరిచయం చేసింది నేనే.. ఇద్దరూ సంతోషంగా ఉండడానికి కారణం కూడా నేనే '' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంలో మాత్రం స్పష్టం లేదు. కానీ ప్రియాంక చోప్రా తల్లి మాత్రం ఒక విదేశీయుడిని తన అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేనని గతంలో తేల్చి చెప్పింది. కానీ ప్రియాంక చోప్రా ఇష్టాన్ని ఆమె కాదనదని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్